టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ రాబోయే రెండేళ్లలో ఏకంగా ఆరు కొత్త ప్రాజెక్ట్ లలో నటించబోతున్నట్టు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా భార్య ముందే నాన్న కోప్పడ్డారని కామెంట్లు చేశారు.
నటుడిగా 41 సంవత్సరాల పాటు నాన్న సినిమాలలో ఉన్నారని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.కొన్ని విషయాలలో నాన్న స్ట్రిక్ట్ గా ఉంటారని చరణ్ కామెంట్లు చేశారు.
శరీరాకృతి కొంచెం మారినా నాన్న అస్సలు ఒప్పుకోరని రామ్ చరణ్ వెల్లడించారు.డైనింగ్ టేబుల్ దగ్గర బరువు తగ్గావని నాన్న కామెంట్ చేసేవారని ఆ మాటలు నిజమేనని భావించి అవునా డాడీ అంటే వెంటనే ఇడియట్ అని తిట్టేవారని చరణ్ చెప్పుకొచ్చారు.
జిమ్ కు వెళ్లాలని నాన్న నాపై ఫైర్ అయ్యేవారని రామ్ చరణ్ కామెంట్లు చేశారు.ఈ విధంగా అవమానిస్తున్నారేంటని ఉపాసన ఆశ్చర్యపోయేదని చరణ్ తెలిపారు.
అది అవమానించడం కాదని ఇద్దరు నటుల మధ్య సంభాషణ అదే విధంగా ఉంటుందని నేను చెప్పానని చరణ్ వెల్లడించారు.చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టమని చదువుపై ఆసక్తి పెద్దగా ఉండేది కాదని రామ్ చరణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.ఒకరోజు డీన్ నాన్నకు ఫోన్ చేసి అతనికి ఏం చేయాలనిపిస్తే అది చేయాలని సూచించారని రామ్ చరణ్ వెల్లడించడం గమనార్హం.
కొడుకు టైమ్ ను , నా టైమ్ ను వృథా చేయొద్దని ఆయన చెప్పారని రామ్ చరణ్ కామెంట్లు చేశారు.ఆ తర్వాత నేను యాక్టింగ్ స్కూల్ కు షిప్ట్ అయ్యానని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.రామ్ చరణ్ వెల్లడించిన ఈ విషయాలు వైరల్ అవుతున్నాయి.
చరణ్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.