తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ విజయవాడకు బయలుదేరారు.ముందుగా అమరావతిలోని సెక్రటేరియట్ కు చేరునకోనున్న ఆయన జీఏడీలో రిపోర్ట్ చేయనున్నారు.
తరువాత చీఫ్ సెక్రటరీతో భేటీ కానున్నారు.అనంతరం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో సోమేశ్ కుమార్ సమావేశం కానున్నారు.
కాగా ఆయనకు ఏ పోస్టింగ్ ఇస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ఈ క్రమంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈరోజు జాయిన్ కావాలన్నారు.దాని ప్రకారం జాయిన్ అవుతానని చెప్పారు.
ఒక అధికారిగా ప్రభుత్వం ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తానని సోమేశ్ కుమార్ తెలిపారు.







