హైదరాబాద్లో వరుస చైన్ స్నాచింగ్లపై పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.ఇందులో భాగంగా నలుగురు నిందితులను ఢిల్లీలో గుర్తించారు.
ఈ క్రమంలో నిందితులను అదుపులోకి తీసుకునేందుకు హైదరాబాద్ పోలీసులు హస్తినకు వెళ్లారు.అక్కడి పోలీసుల సహకారంతో కేటుగాళ్లను పట్టుకునేందుకు విస్తృతంగా గాలిస్తున్నారు.
నిందితులు పంకజ్, మంగళ్, దీపక్ మరియు సెహ్వాగ్ లుగా పోలీసులు గుర్తించారు.హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ కు పాల్పడిన అనంతరం కాజీపేట మీదుగా ఢిల్లీకి పారిపోయినట్లుగా గుర్తించారు.







