దేశానికి రాజధాని అయినా ఢిల్లీకి వున్న చెడ్డ పేరు మరే సిటీకి ఉండదంటే అతిశయోక్తి కాదేమో.ఎవరో అన్నట్టు అక్కడ పెరిగిపోతున్న కాలుష్యంతోపాటు మనషులు కూడా కలుషితం అయిపోయాయి అనడానికి ఎన్నో ఉదాహరణలు అనునిత్యం మనకు వినిపిస్తూ ఉంటాయి.
దొంగతనాలు, దోపిడీలు, దౌర్జన్యాలు… మానభంగాలు ఇలా ఒక్కటేమిటి ఢిల్లీ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు.ముఖ్యంగా అక్కడ యువత పేట్రేగిపోతున్నారు.
తాజాగా ఢిల్లీ, మీరట్ హైవే రోడ్లపై కొందరు యువకులు భయంకర స్టంట్స్‌తో రెచ్చిపోయారు.

అవును, ఏకంగా కదులుతున్న కారుపైకే ఎక్కి రకరకాల విన్యాసాలు చేశారు.ఓ ముగ్గురు, నలుగురు వ్యక్తులు కదులుతున్న కారు అద్దాల్లోంచి బయటికి వంగి తోటి వాహనదారులతో చాలా దురుసుగా ప్రవర్తించారు.వారిలో ఒకరు తన ఫోన్ కెమెరాలో కారు స్పీడును వీడియో తీస్తూ కనిపించారు.
దాంతో పక్కపక్కనే పయనిస్తున్న వాహనదారులు భయాందోళనకు గురి అయ్యారు.ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి రోడ్డు భద్రతతో పాటు తమ ప్రాణాలకు కూడా ముప్పు కలిగించేలా తీసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దాంతో ఈ వీడియో మీరట్ పోలీసుల వరకూ వెళ్లింది.

అంతేకాకుండా, సదరు కారుపైన పోలీస్ స్టిక్కర్ ఉండటం గమనార్హం.‘స్వాతి మలివాల్’ చేసిన ట్వీట్ ఆధారంగా పోలీసు సైరన్, రెడ్ లైట్, పోలీసు స్టిక్కర్ వేసి ఉన్న వాహనంలో వారు అలా హైవేపై ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా ప్రయాణించారు.ఇది పోలీసు అధికారుల వాహనం అయితే, ఎవరి ప్రమేయంతో వాళ్లు ఇలాంటి స్టెంట్స్ చేస్తున్నారో కనిపెట్టాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
వీడియో రికార్డ్ చేసిన వ్యక్తిని కూడా గుర్తించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.సదరు కారు మారుతీ సుజుకి కారు UP రాష్ట్రం క్రింద రిజిస్టర్ చేయబడింది.
నంబర్ ప్లేట్ “UP 14 AE 3621” అని రాసి ఉంది.సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావటంతో నెటిజన్లు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.







