హైదరాబాద్ కూకట్పల్లిలో ఎస్వోటీ కానిస్టేబుళ్లపై దాడి జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.సిక్కుల బస్తీలో ఇద్దరు ఎస్వోటీ కానిస్టేబుళ్లపై ఓ దుండగుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు.
దాడిలో భాగంగా కానిస్టేబుల్ ఛాతిలో దుండగుడు బలంగా కత్తితో పొడిచాడు.మరో కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే స్పందించిన స్థానికులు గాయపడిన ఇద్దరు కానిస్టేబుళ్లను ఆస్పత్రికి తరలించారు.కాగా ఓ కేసు దర్యాప్తు నిమిత్తం కానిస్టేబుళ్లు సిక్కుల బస్తీకి వెళ్లగా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
గాయపడిన కానిస్టేబుళ్లు రాజు, వినయ్ లుగా గుర్తించారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుడి కోసం గాలిస్తున్నారు.







