భారతీయ సినీ చరిత్రలో తారక్ కు మాత్రమే సొంతమైన అరుదైన రికార్డ్ ఇదే!

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ హీరోలు నటనే ప్రాణంగా జీవనం సాగిస్తారు.అలా సినిమా రంగంలో నటనే ప్రాణంగా భావించే హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు.

 Junior Ntr Rare Record With Variety Oscar Best Actor Predictions List Details, J-TeluguStop.com

జూనియర్ ఎన్టీఆర్ ప్రతిభకు ఆయనకు దక్కిన గుర్తింపుకు మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువని ఆయన ఫ్యాన్స్ భావిస్తారు.అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో మరో అరుదైన రికార్డ్ చేరడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.

వెరైటీ ఆస్కార్ బెస్ట్ యాక్టర్ ప్రిడిక్షన్ జాబితాలో టాప్ 10లో జూనియర్ ఎన్టీఆర్ నిలవగా ఈ జాబితాలో నిలిచిన హీరో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కావడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.భారతీయ సినీ చరిత్రలో ఈ అరుదైన రికార్డ్ తారక్ కు మాత్రమే సొంతమైందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

తారక్ కు ఆస్కార్ వస్తే మాత్రం ఫ్యాన్స్ సంతోషం మామూలుగా ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Telugu Ntr, Ntr Fans, Ntr Rare, Ntr Oscar Award, Rare, Rrr, Tarak, Tollywood-Mov

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ సినిమాకు మాత్రమే పరిమితం కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి కూడా తాజాగా ప్రకటన వెలువడింది.2024 సంవత్సరంలో తారక్ బాక్సాఫీస్ వద్ద మరోసారి ప్రభంజనం సృష్టించనున్నారని స్పష్టత వచ్చేసింది.తారక్ ప్రతిభకు ఎన్ని అవార్డులు వచ్చినా తక్కువేనని తారక్ కు మరిన్ని అవార్డులు రావాలని ఫ్యాన్స్ చెబుతుండటం గమనార్హం.

Telugu Ntr, Ntr Fans, Ntr Rare, Ntr Oscar Award, Rare, Rrr, Tarak, Tollywood-Mov

జూనియర్ ఎన్టీఆర్30 సినిమాకు జాన్వీ కపూర్ తో పాటు మరి కొందరు హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నారు.వచ్చే నెల నుంచి గ్యాప్ లేకుండా ఈ సినిమా షూటింగ్ జరగనుందని తెలుస్తోంది.జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో సినిమాకు సంబంధించి కూడా త్వరలో అప్ డేట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది.కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాలు నటుడిగా తారక్ స్థాయిని పెంచుతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

తారక్ తర్వాత సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube