రోజు నైట్ ఈ న్యాచురల్ సీరంను వాడితే మచ్చలు పోయి ముఖం అద్దంలా మెరుస్తుంది!

ఎలాంటి మచ్చలు లేకుండా ముఖం అద్దంలా మెరిసిపోతూ ఉంటే ఎంత చూడముచ్చటగా ఉంటుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.అందుకే అటువంటి చర్మం కోసం ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు.

 If You Use This Serum, The Spots Will Disappear And The Face Will Shine Like A M-TeluguStop.com

కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ చర్మం పై ఏదో ఒక కారణం చేత మచ్చలు పడుతూనే ఉంటాయి.ఇక ఆ మచ్చలను వదిలించుకోవడం కోసం పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు.

అయితే ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ సీరంను రోజు నైట్ వాడితే ఎటువంటి మచ్చలైన క్రమంగా దూరమవుతాయి.అదే సమయంలో ముఖం అద్దంలా మెరిసిపోతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ న్యాచురల్ సీరంను ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఓ చూపు చూసేయండి.ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, నాలుగు టేబుల్ స్పూన్లు రోజు వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.

ఆ తర్వాత మరో బౌల్‌ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు కీర జెల్‌, హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వేసుకుని రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి.చివరిగా కలిపి పెట్టుకున్న రోజ్ వాటర్ మరియు ఆపిల్ సైడర్ వెనిగర్ ను వేసి మరోసారి మిక్స్ చేసుకుంటే మన సీరం సిద్ధమవుతుంది.

ఈ సీరంను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ముఖాన్ని వాటర్ తో వాష్ చేసుకోవాలి.ఆపై తయారు చేసుకున్న సీరంను ముఖానికి అప్లై చేసి స్మూత్ గా మసాజ్ చేసుకోవాలి.ప్రతిరోజు ఈ సీరంను కనుక వాడితే చర్మంపై ఎలాంటి మచ్చలు ఉన్నా క్ర‌మంగా దూరం అవుతాయి.

అదే స‌మ‌యంలో ముఖం అద్దంలా మిలమిల మెరిసిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube