రూ.కోట్ల ఆస్తులు నష్టపోయాను.. నా భార్య వల్లే నేను ఇప్పుడు ఇలా ఉన్నాను: శివబాలాజీ

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరో శివబాలాజీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో నటించినది తక్కువ సినిమాలే అయినాప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు శివబాలాజీ.

 Siva Balaji Open About His Movie Failure 2017 Snehamera Jeevitham Details, Siva-TeluguStop.com

మొదట ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.అయితే మొదట్లో తండ్రి వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్న శివ బాలాజీ ఆ తర్వాత సినిమా రంగంపై ఉన్న ఆసక్తితో సినిమాల లోకి ఎంట్రీ ఇచ్చాడు.

అనంతరం బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని సంపాదించుకున్నాడు.బోలెడంత పాపులారిటీని సంపాదించుకోవడంతోపాటు బిగ్ బాస్ విజేతగా కూడా నిలిచాడు.

ఇక తెలుగులో చందమామ, శంభో శివ శంభో, ఆర్య, అన్నవరం, టెన్త్ క్లాస్ డైరీస్ లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శివబాలజీ తన జీవితంలో ఎదురైన పలు అనుభవాల గురించి వెల్లడించారు.

ఈ సందర్భంగా శివ బాలాజీ మాట్లాడుతూ.నా ఫ్రెండ్స్ ద్వారా ఈము పక్షుల పెంపకం గురించి విన్నాను.దానికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని చెప్పారు.ఆ తర్వాత నేను ఈము పక్షుల పెంపకం మొదలు పెట్టాను.

మొదట దాదాపుగా 500 ఈము పక్షులతో యూనిట్ని ప్రారంభించాం.వాటికి నెలకు దాదాపుగా ఐదు లక్షల వరకు ఖర్చు చేసే వాడిని.

Telugu Shiva Balaji, Biggboss, Madhumitha, Siva Balaji, Tollywood-Movie

ఆ తర్వాత మాకు అదంతా ఒక స్కాం అని తెలిసింది.కానీ ప్రభుత్వం మీట్ ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిందని తెలిపారు.వాటీకి తగినంత మార్కెట్ దొరకలేదు.ఆ తర్వాత పెయిన్ రిలీఫ్ ఆయిల్, సోప్స్ వ్యాపారం మొదలుపెట్టాము.అది కూడా పెద్దగా సక్సెస్ కాలేదు.ఆ సమయంలోనే స్నేహమేరా జీవితం సినిమాను కూడా చేశాను.

ఆ సినిమా కూడా వర్కౌట్ కాలేదు.ఆ సినిమా కోసం దాదాపుగా రెండు కోట్ల రూపాయల ఖర్చు చేశాను.

దాంతో ఆ సినిమా ప్రభావం నాపై చాలా ఎక్కువగా పడింది.ఆ సమయంలో లోలోపల చాలా ఫీల్ అయ్యాను.

నావల్ల అందరూ బాధపడ్డారని భావించాను.నావల్ల అందరూ ఫెయిల్ అయ్యారని తీవ్ర నిరాశకు గురయ్యాను.

ఆ సమయంలో నా భార్య మధుమిత వల్లే నేను మళ్ళీ నార్మల్ మనిషిని అయ్యాను అని చెప్పుకొచ్చాడు శివ బాలాజీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube