పునర్నవి భూపాలం తక్కువ సినిమాలే చేసినా సోషల్ మీడియాలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న సెలబ్రిటీలలో ఒకరనే సంగతి తెలిసిందే.ఉయ్యాల జంపాల సినిమాలో సునీత రోల్ లో నటించి మెప్పించిన పునర్నవికి ఆ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది.
ఆ తర్వాత పునర్నవి మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాలో పార్వతి పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.
పిట్టగోడ సినిమాలో పునర్నవి హీరోయిన్ గా నటించగా ఈ సినిమా కూడా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
అయితే సినిమాల కంటే బిగ్ బాస్ షో ద్వారానే పునర్నవికి మంచి పేరు వచ్చింది.పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించిన పునర్నవి తాజాగా తన అనారోగ్య సమస్యల గురించి వెల్లడించారు.
బిగ్ బాస్ షో సీజన్3 ద్వారా పాపులర్ అయిన పునర్నవి పలు సందర్భాల్లో బోల్డ్ గా కామెంట్లు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.
ప్రస్తుతం లండన్ లోని సైకాలజీలో హయ్యర్ స్టడీస్ చేస్తున్న పునర్నవి సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటున్నారు.కొన్నిరోజుల క్రితం అనారోగ్యం బారిన పడిన పునర్నవి తాజాగా సోషల్ మీడియా ద్వారా ఆ విషయాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నారు.తాను ప్రస్తుతం ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాధ పడుతున్నానని ఆమె షాకింగ్ కామెంట్లు చేశారు.
అనారోగ్య సమస్యతో నా కొత్త సంవత్సరం మొదలైందని పునర్నవి చెప్పుకొచ్చారు.ఈ మధ్య కాలంలో అనారోగ్యం బారిన పడటం ఇదే తొలిసారి అని ఇదే చివరిసారి కూడా కావాలని కోరుకుంటున్నానని పునర్నవి తెలిపారు.పునర్నవి త్వరగా ఆరోగ్య సమస్య నుంచి కోలుకోవలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.పునర్నవి రాబోయే రోజుల్లో సినిమా ఆఫర్లతో బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.