పవన్ కళ్యాణ్ కు బిగ్గెస్ట్ హిట్ ఇచ్చింది నేనే.. సంచలన వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ నటుడు నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.వివాదాస్పద నటుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు బండ్ల గణేష్.

 Bandla Ganesh Sensational Comments On Pawan Kalyan And Trivikram ,pawan Kalyan,-TeluguStop.com

సినిమాలకు సంబంధించిన విషయాలలో రాజకీయాలకు సంబంధించిన విషయాలను తరచూ ఏదోక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.అంతేకాకుండా బండ్ల గణేష్ కు వివాదాలు లేకపోతే నిద్ర పట్టదు అన్న విధంగా ఏదో ఒక విషయంలో వార్తల్లో కాంట్రవర్సీలలో తల దూరుస్తూ ఉంటాడు.

మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో ఎవరైనా వ్యక్తిగతంగా కానీ రాజకీయపరంగా కానీ విమర్శలు గుప్పిస్తే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.

కాంట్రవర్సీలను క్రియేట్ చేయడంలో, వివాదాలను కొనితెచ్చుకోవడంలో నాకు ఆయనే సాటి అని చెప్పవచ్చు.

ఇకపోతే పవన్ కళ్యాణ్ కి బండ్ల గణేష్ వీరాభిమాని అన్న సంగతి మనందరికీ తెలిసిందే.అయితే ఇదివరకు అని చెప్పవచ్చు.ఎందుకంటే ఈ మధ్యకాలంలో బండ్ల గణేష్ లో చాలా మార్పు వచ్చింది.ఇదే విషయాన్ని పవన్ అభిమానులు కూడా తెలుపుతున్నారు.

కాగా మొన్నటికి మొన్న ఎన్టీఆర్ నా గాడ్ అని బండ్ల గణేష్ చెప్పడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇది ఇలా ఉంటే తాజాగా బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ పై త్రివిక్రమ్ పై సంచలన వ్యాఖ్యలు చేసి మరొకసారి హాట్ టాపిక్ గా మారాడు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బండ్ల గణేష్ త్రివిక్రమ్ గురించి మాట్లాడుతూ.పవన్ కళ్యాణ్ కు బిగ్గెస్ట్ హిట్ ఇచ్చింది నేను.

Telugu Bandla Ganesh, Bandlaganesh, Pawan Kalyan, Tollywood, Trivikram-Movie

నిజమైన పవన్ కళ్యాణ్ ను బయటకు తీసింది నేను.విపరీతమైన టాలెంట్ ఉన్న ఆయన అద్భుతమైన వ్యక్తి.ఆయనకో అతీతమైన వ్యక్తి.ఆయన వేరే స్థాయిలో ఉండాలి అనుకున్నది నేను.ఇప్పుడు చాలామంది గురూజీలు బరూజీలు వచ్చారు.నాకు తెలియదు అది.నాకు ఈ రోజు కూడా పవన్ గారి మీద కృతజ్ఞత ఉంటుంది.ఆ కృతజ్ఞత నాపై వారు చూపించాలని నేను అనుకోను అంటూ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ పై ఇండైరెక్టుగా సెటైర్లు వేశాడు బండ్ల గణేష్.

ఈ వార్తలపై స్పందించిన పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ అభిమానులు బండ్ల గణేష్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బండ్ల గణేష్ లో మార్పు వచ్చింది అని అభిప్రాయం వ్యక్తం చేయగా నువ్వు పవన్ కళ్యాణ్ కి బిగ్గెస్ట్ హిట్ ఇవ్వడం ఏంటి అంటూ మండిపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube