ఈ సంక్రాంతికి మెగా మరియు నందమూరి ఫ్యాన్స్ కి పండుగ డబుల్ చేసేందుకు చిరంజీవి మరియు బాలకృష్ణ వాల్తేరు వీరయ్య ఇంకా వీర సింహారెడ్డి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధిస్తాయనే నమ్మకం తో అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
సంక్రాంతికి ఈ రెండు సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున స్క్రీనింగ్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.సాధారణంగా కొత్త సినిమాలకు ఐదు షోలు వేసుకునేందుకు అనుమతి ఉంది.
అయితే ఈ రెండు సినిమాలను ఏకంగా ఆరు షోలు వేయాలని నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్స్ ప్రయత్నాలు చేస్తున్నారట.మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమా లను భారీ బడ్జెట్ తో నిర్మించిన విషయం తెలిసిందే.
ఈ రెండు సినిమాలు కూడా వారే నిర్మించడంతో చాలా ఏరియాల్లో డిస్ట్రిబ్యూషన్ కూడా వారే చేస్తున్నారు.
స్థానిక పంపిణీదారులతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమా లను పెద్ద మొత్తం లో విడుదల చేయడం ద్వారా లాభాలను దక్కించుకోవాలని చూస్తున్నారు.
ఇక ఈ సినిమాల యొక్క అదనపు షో ల కోసం తెలుగు రాష్ట్రాల్లో అనుమతులు పొందేందుకు దరఖాస్తు చేయడం జరిగిందట.ఒకటి రెండు రోజుల్లోనే అందుకు సంబంధించి సమాధానం వచ్చే అవకాశం ఉంది.

రెండు సినిమాలు కూడా 100 కోట్ల బడ్జెట్ కి పైగా ఖర్చు చేసిన సినిమాలే.అందుకే 5 లేదా 6 షో స్ మొదటి వారం రోజులు పడితే తప్పితే బ్రేక్ ఈవెన్ సాధ్యం కాదు.సినిమాలు సక్సెస్ అయిన కూడా భారీగా వసూళ్లు సాధించాలంటే మొదటి వారం రోజుల పాటు ఐదు లేదా ఆరు షోస్ వేయాల్సి ఉంటుందని విశ్లేషకుల అభిప్రాయం చేస్తున్నారు.అందుకే మంత్రి మూవీ మేకర్స్ వారు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.
మరి ఈ సంక్రాంతి సినిమాలు ఐదు లేదా ఆరు షో లతో సందడి చేసేనా.అసలు ఆ ఛాన్స్ ఉంటుందా అనేది చూడాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.







