వైసీపీలో పెరుగుతున్న ధిక్కార స్వరాలు ! సంబరపడిపోతున్న రఘురామ ?  

ఏపీ అధికార పార్టీ వైసీపీలో రోజురోజుకు దిక్కరస్వరాలు పెరిగిపోతున్నాయి.ముఖ్యంగా ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ,  ప్రజల్లో ఉన్న అసంతృప్తి తమపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుండడంతో, వారు సైతం తమ అసంతృప్తిని బయటకు వెళ్ళగకుతున్నారు.

 Growing Voices Of Contempt In Ycp! Raghurama Is Celebrating , Raghurama Krishnam-TeluguStop.com

కొద్దిరోజుల క్రితం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జనం నుంచి ఆయనకు అనేక సమస్యల విషయమై నిలదీతలు ఎదురుకాగా, జగన్ పైన , ప్రభుత్వం తీరుకైన అసంతృప్తి వ్యక్తం చేశారు.

  ఇక ఆ తర్వాత సీనియర్ పొలిటిషన్ వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సైతం జగన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

 ప్రజలకు మనం ఏం చేశామని ఓట్లు అడగమంటారు అంటూ జగన్ ను ఉద్దేశించి రాం నారాయణరెడ్డి ప్రశ్నించారు.

రోడ్లపై గుంతలనే ఇంకా పూడ్చలేదు అలాంటిది బటన్ నొక్కాను, పెన్షన్లు ఇచ్చాను అని సీఎం చెప్పడం ఆశ్చర్యంగా ఉందంటూ రాం నారాయణ రెడ్డి విమర్శలు చేశారు.ఈ విధంగా ఒక్కో నేత తమ అసంతృప్తిని తెరపైకి తీసుకు వస్తున్న క్రమంలో వైసిపి రెబల్ ఎంపీ గా గుర్తింపు పొందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈ వ్యవహారాలపై స్పందించారు.

అహంకారానికి ఆత్మాభిమానానికి జరుగుతున్న సమరంగా వైసిపి నాయకుల తిరుగుబాటును రఘురామ అభివర్ణించారు.ఆత్మాభిమానానికి  ఒకప్పుడు తాను ప్రతీక అయితే , ఇప్పుడు ఆనం రామనారాయణరెడ్డి ప్రతీక అంటూ కొనియాడారు.

జగన్ నిలువెత్తు అహంకారానికి నిదర్శనం అంటూ రఘురామ విమర్శలు చేశారు.
 

Telugu Anamramnarayana, Ap, Kotamsridhar, Sapuram Mp, Nelluru, Ysrcp Rebal Mp-Po

 ఇన్ని రోజులు ఓపిక పట్టిన వారు… అవమానాలను సహించిన వారంతా ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారని రఘురామ విమర్శించారు.సీనియర్ పొలిటిషన్ మాజీమంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి పార్టీలో ఉన్నారో లేదో తెలియదు అంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జన రామకృష్ణారెడ్డి ప్రస్తావించడాన్ని రఘురామ తప్పుపట్టారు.32 ఏళ్ల వయసులో ఉమ్మడి ఏపీకి రెవెన్యూ మంత్రిగా పనిచేసిన డిఎల్ అంతటి సీనియర్ నాయకుడిని  ఎవరు బతిమిలాడి పార్టీలోకి తీసుకువచ్చారో ప్రజలందరికీ తెలుసునని రఘురాం వ్యాఖ్యానించారు.వైసీపీలో రోజు రోజుకు పెరుగుతున్న దిక్కరాలు రఘురామ కు మరింత ఆనందం కలిగిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube