జొమాటో గురించి జనాలకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.నేటి ఆన్లైన్ యుగంలో అన్ని పనులు చకచకా క్షణాల్లో మన ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నాయి.
దానికి అరచేతిలో ఉన్న ఒక్క స్మార్ట్ ఫోన్ చాలు.ఇక టెక్నాలజీ మీద ఏమాత్రం అవగాహనా వున్న జనాలు ఏదైనా కావాలంటే ఎక్కడికో బయటికి వెళ్లడం లేదు.
చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లోనే ఒక క్లిక్ తో కావాల్సిన వస్తువులను ఇంటి ముందుకు రప్పించుకుంటున్నారు.ఈ క్రమంలోనే ఆహారం విషయమై ఈ జొమాటో వంటి యాప్స్ సూపర్ పాపులర్ అయ్యాయి.
అవును, నేటి మానవుడు తమకు నచ్చిన ఫుడ్ ని స్మార్ట్ ఫోన్లో ఒక క్లిక్ ద్వారా ఆర్డర్ చేసి ఇక నిమిషాల వ్యవధిలో తెప్పించుకుంటున్నారు.ఈ క్రమంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ అయినటువంటి జొమాటోలో ఓ ఆసక్తికరమైన విషయం చోటు చేసుకుంది.
అవును, ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తూ అంతకంతకూ తమ కష్టమర్ల సంఖ్యను పెంచుకుంటూ పోతోన్న జొమాటో కంపెనీలో 2022 ఏడాది ముగిసిన నేపథ్యంలో ఇక జొమాటోలో బెస్ట్ కస్టమర్ ఎవరు అన్న విషయాన్ని సర్వే చేసి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు కంపెనీ ప్రతినిధులు.

ఈ క్రమంలోనే సదరు బెస్ట్ కస్టమర్ ఆర్డర్ చేసిన జాబితాను గురించి తెలిసి నెటిజన్లు షాక్ తింటున్నారు.అవును, ఢిల్లీకి చెందిన అంకుర్ అనే వ్యక్తి ఈ ఏడాది అత్యధికంగా 3330 ఫుడ్ ఆర్డర్లు చేసినట్టు జొమాటో నిక్షిప్తమైంది.దీంతో అతనికి బెస్ట్ కస్టమర్ అవార్డును కూడా ప్రకటించడం విశేషం.అలాగే ముంబైకి చెందిన మరో వ్యక్తి యాప్ లో ప్రోమో కోడ్లను ఉపయోగించి ఏకంగా 2.43 లక్షలు సేవ్ చేసాడని సమాచారం.అంతేకాకుండా ఇండియాలో అత్యధికంగా నిమిషానికి 186 బిర్యానీలు, 139 పిజ్జాలను వినియోగదారులు ఆర్డర్ చేసినట్లు ఇటీవలే జొమాటోలో వెల్లడైంది.







