బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సల్మాన్ ఖాన్ బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.
సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్స్ సినీమాలలో నటించి స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న విషయం తెలిసిందే.ఇప్పటికీ అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు.
ఇది ఇలా ఉంటే సల్మాన్ ఖాన్ తాజాగా తన 57వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.సల్మాన్ ఖాన్ పుట్టినరోజుని ఆయన సోదరీ అర్పితా ఖాన్ నివాసంలో గ్రాండ్ గా నిర్వహించారు.
అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కాగా ఈ బర్త్ డే పార్టీకి బాలీవుడ్ సినీ తారలతో పాటు కుటుంబ సభ్యులు సన్నిహితులు కూడా హాజరయ్యి సందడి సందడి చేశారు.
బాలీవుడ్ షారుక్ ఖాన్ సైతం బర్త్ డే పార్టీకి హాజరయ్యారు.కాగా ఈ బర్త్ డే పార్టీలో సల్మాన్ ఖాన్ చేసిన పనికి అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు.
సల్మాన్ ఖాన్ పుట్టినరోజు వేడుకలకు ఆయన మాజీ లవర్ సంగీత బిజ్ లానీ కూడా హాజరయ్యింది.ఈ క్రమంలోనే ఆమెతో మాట్లాడిన సల్మాన్ ఖాన్ అనంతరం ఆమె నుదుటిపై ముద్దు కూడా పెట్టాడు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆ ఫోటోలను చూస్తున్న నెటిజన్స్ సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి పట్ల చూపించిన ప్రేమకు ఫిదా అవుతున్నారు.అంతేకాకుండా ఆమె కారు ఎక్కుతుండగా డోర్ తీసి మరి ఆమెను సాగనంపడంతో సల్మాన్ ఖాన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.సల్మాన్ ఖాన్ బర్త్ డే పార్టీకి బాలీవుడ్ సెలబ్రిటీలు అయినా జాన్వి కపూర్, పూజా హెగ్డే, టబు, సునీల్ శెట్టి, రితేష్ దేశముఖ్,జెనీలియా, కార్తీక్ ఆర్యన్ ఇలా పలువురు సెలబ్రిటీలు హాజరై సందడి సందడి చేశారు.







