ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు ఎన్నో రకాల వైరస్లు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి.అందులో ముఖ్యమైనది కరోనా వైరస్.
కానీ ప్రస్తుతం కొవిడ్ కి మించిన వైరస్ వచ్చే అవకాశం ఉందని, అదే కనుక వస్తే ప్రాణాల మీద ఆశలు వదిలేసిందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.తాజాగా దక్షిణ కొరియాలో సంభవించిన ఒక మరణం ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేసింది.
అంటే దాని పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.ఈ వైరస్ కి ఎందుకంత భయపడుతున్నారంటే కోవిడ్ తర్వాత ప్రపంచాన్ని కంగారు పెట్టేందుకు సిద్ధమవుతున్న మరో సమస్య.
ఈ నేపథ్యంలో తాజాగా దక్షిణ కొరియాలో సంబంధించిన ఒక మరణం మొదటి బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసుగా అక్కడి వైద్యులు గుర్తించారు.

ఈ మధ్యకాలంలో దక్షిణ కొరియాకు చెందిన ఒక వ్యక్తి నాలుగు నెలలపాటు థాయిలాండ్ లో గడిపి డిసెంబర్ 10న తిరిగి స్వాదేశానికి వచ్చాడు.కొద్ది రోజులకే తలనొప్పి, జ్వరం, వాంతులు, మాట తెడపడడం వంటి లక్షణాలతో తీవ్ర ఇబ్బంది పడ్డాడు.ఈ ఇబ్బందులతో సరిగ్గా 11 రోజులు తిరిగేసరికి ప్రాణాలను కోల్పోయాడు.
ఆ వ్యక్తి పోస్టుమార్టం రిపోర్ట్ లో బ్రెయిన్ తినే వైరస్ ఉన్న వ్యాధి కారణంగా ఆ వ్యక్తి మరణించినట్లు తెలిసింది.ఈ వైరస్ మట్టిలో, చెరువులు, సరస్సులు నదుల్లో కనిపిస్తూ ఉంటుంది.
సరిగ్గా క్లోరినేషన్ చేయని స్విమ్మింగ్ పూల్స్ కూడా ఈ వైరస్ ఉండే అవకాశం ఉంది.వాటిల్లో స్నానం చేసే సమయంలో నోటి ద్వారా లేదా ముక్కు ద్వారా నీళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది.1962 నుంచి 2021 వరకు అమెరికాలో ఈ వ్యాధి 154 మందికి వచ్చింది.కేవలం నలుగురు అంటే నలుగురు మాత్రమే ప్రాణాలతో మిగిలారు.
ఇందులో మరో ప్రధానమైన సమస్య వ్యాధి సోకిన మొదట్లో దిని గుర్తించడం అస్సలు సాధ్యం కాదు.ఒకసారి ఇది సోకిందంటే చాలా వేగంగా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది.
ఈ వ్యాధి సోకిన తర్వాత మొదటి స్టేజిలో తలనొప్పి, జ్వరం, జలుబు, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి.







