వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలలో ఒకడైన కొడాలి నాని మళ్లీ మాటల యుద్ధంలోకి దిగాడు.ఈ వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత మాట్లాడుతూ తాను గుడివాడలో ఉన్నంతవరకూ తనను ఓడించే నాయకుడు ఉండడని ప్రభుత్వాలు పలికాడు.
సోమవారం మీడియాతో మాట్లాడుతూ తనను ఓడించే మగాడు కూడా ఇంకా పుట్టలేదని సంచలన ప్రకటనలు చేశాడు నాని.
అలాగే గుడివాడ ఓటర్ల పై తనకు నమ్మకం ఉందని వారే తన భవిష్యత్తును నిర్దేశిస్తారని చెబుతూ వైసిపి ఎవరితో పొత్తు పెట్టుకునే అవకాశం లేదన్నాడు.
మా వైసీపీ నాయకులకు ఎవరి బూట్లు నాకాల్సిన అవసరం లేదని చెప్పుతూ “దట్ ఈజ్ వైఎస్ఆర్, దట్ ఈజ్ జగన్” అని కొడాలి వ్యాఖ్యానించాడు.ఇచ్చిన ప్రతి హామీని మేము అమలు చేస్తున్నాము… మీకు ఇష్టమైతే ఓటేయండి లేదంటే పీకి పక్కన పడేయండి అని జగన్ చెబుతున్నారని నాని వ్యాఖ్యానించాడు.
అయితే కొడాలి నాని కి అధిష్టానం నుండి ఎంతవరకు మద్దతు ఉందో తెలియదు గానీ ఇతనిని మంత్రి మండలి నుండి కూడా తొలగించారు.ఇతని దుందుడికి మాటలు, ప్రజల్లో అతి దూకుడు వల్ల తెచ్చుకున్న వ్యతిరేకతే అందుకు ప్రధాన కారణాలని తెలుస్తోంది.
పైగా గుడివాడలో అతనికి మద్దతు కూడా ప్రస్తుతం బాగా తగ్గిపోయిందని భోగట్టా.ఇలాంటి సమయంలో నన్ను ఓడించే మగాడు పొట్ట లేడని అతను అంటుండడం విశేషం.
వచ్చే ఎన్నికల్లో అతనికి టికెట్ లభించకపోతే పరిస్థితి ఏమిటో కూడా నాని ఆలోచించుకోవలసి ఉంది.

ఇక నాని దివంగత నేత వంగవీటి రంగా గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.తనకు రక్షణ లేదని రంగా వేడుకున్నప్పటికీ టిడిపి గవర్నమెంట్ పట్టించుకోకపోవడం వల్లే అతను చనిపోయారని… అతని చావుకి తెలుగుదేశం పార్టీ వారే కారణమని అన్నాడు.ఇక రంగా పేరు చెప్పుకోకుండా రాష్ట్రంలో రాజకీయం చేయలేని పరిస్థితి టిడిపిది అని విమర్శలు గుప్పించారు.
అంతేకాకుండా చంద్రబాబు, టిడిపి నేతల ప్రమేయంతోనే వంగవీటి రంగా హత్య జరిగిందని వ్యాఖ్యానించడం గమనార్హం.

మరి జగన్ అధికారంలోకి వచ్చే కొద్ది రోజులు ముందు అతని బాబాయ్ అనుమానస్పద హత్య గురించి కొడాలి నాని ఏం చెప్తారో? ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా సొంత బాబాయ్ హత్య కేసు ఇంకా తేల్చకపోవడం, అతని మరణం వెనక వైసిపి హస్తం ఉందని అనేవాళ్ళ నోళ్లు మూయించలేకపోవడం గురించి కూడా కొడాలి నాని మాట్లాడితే బాగుండేదని పలువురు అంటున్నారు.మరి ఇలాంటి కామెంట్లతో నాని తన సీటుకే ఎసరు పెట్టుకుంటున్నారా అనుమానాలు కూడా కలుగుతున్నాయి.







