గత కొన్ని రోజుల నుంచి విపరీతంగా కురుస్తున్న మంచు తో పాటు చలి వల్ల రెండు దేశాలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నాయి.ఒక్క అమెరికాలోనే ఇప్పటివరకు 34 మంది మరణించినట్లు అధికారులు చెబుతున్నారు.
న్యూయార్క్ రాష్ట్రంలోని బఫెలో నగరం అత్యంత ప్రభావిత ప్రాంతంగా మారిపోయింది.ఇంకా చెప్పాలంటే ఈ బాంబ్ సైక్లోన్ అమెరికా కెనడాలో భారీ ఎత్తున ప్రభావం చూపుతున్నట్లు సమాచారం.
కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రానికి చెందిన మెరిట్ పట్టణానికి దగ్గరలో మంచుతో నిండిన రహదారిపై ఒక బస్సు బోల్తా పడి నలుగురు మృతి చెందారు.ఇంకా చెప్పాలంటే కొన్ని రోజులుగా తీవ్రంగా ఉన్న చలి మంచు వల్ల విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది.
అమెరికాలో ఆదివారం మధ్యాహ్నానికి కనీసం రెండు లక్షల మంది విద్యుత్ లేక ఇబ్బంది పడుతున్నారు.అయితే అంతకు ముందు 17 లక్షల నుంచి ఈ సంఖ్య తగ్గి ఈ స్థాయికి చేరుకోవడం మంచి విషయమే అని అక్కడి ప్రజలు అనుకుంటున్నారు.
మంచు తీవ్రత కారణంగా వేలాది విమానాలు రద్దు చేశారు.క్రిస్మస్ వేడుకలకు చాలామంది ఇళ్లకు చేరుకోలేకపోతున్నారు.
ఆదివారం నాటికి సుమారు ఐదున్నర కోట్ల మంది అమెరికాలో తీవ్ర చలి హెచ్చరికలను ఎదుర్కోవాల్సి వచ్చింది.ఇలాంటి అతిపెద్ద మంచు తుఫాను ఎప్పుడు చూడలేదని ఇది దక్షిణాన ఉన్న టెక్సాస్ వరకు విస్తరించి ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు.

ఈ చలికాలంలో అమెరికాలో ఏర్పడిన బాంబ్ సైక్లోన్ వాతావరణం లో పీడనం తగ్గడం వల్ల ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.ఈ సైక్లోన్ కారణంగా అమెరికాలో ప్రయాణికులకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు సమాచారం.ఈ తుఫాన్ ప్రభావం బఫెలో నగరానికి వినాశకారంగా మారడంతో ఈ ప్రాంతంలో కొంతమంది కార్లలోనే చనిపోయారు అంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.ఇంకా కొంతమందిని అక్కడి సిబ్బంది రక్షించినట్లు.







