నేడు స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతిలోకి వచ్చి చేరడంతో సోషల్ మీడియా ప్రభావం బాగా ఎక్కువైంది.దాంతో దేశం నలుమూలలా జరిగే విషయాలను వీడియో కంటెంట్ రూపంలో అందుబాటులోకి వచ్చేస్తోంది.
ఇంకేముంది జనాలకి ఏది నచ్చుతుందో అది కాస్త క్షణాల్లో వైరల్ అయిపోతుంది.ఇక వైరల్ అవుతున్న వీడియోలలో ఎక్కువగా పెళ్లి వీడియోలు ఉండటం కొసమెరుపు.
పెళ్లి అనేది నూరేళ్ళ పంట.ఈమధ్యకాలంలో పెళ్లి వేడుకలు చాలా చోట్ల చాలా హాట్టహాసంగా జరుగుతున్నాయి.ఈ క్రమంలో పెళ్లి వూరేగింపుకి సంబందించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.
తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.
పెళ్లి వేడుకలో సెలబ్రిటీల రేంజ్‌లో ఫీల్ అయ్యేందుకు, ఊరేగింపుని ఒక స్పెషల్ అట్రాక్షన్‌గా చేసుకుంటున్నారు వధూవరులు.ఇక అలాంటి వేడుక కోసమే బీహార్ లోని గుడ్డు శర్మ అనే వ్యక్తి తన క్రియేటివిటీని వాడి టాటా నానో కారును హెలికాప్టర్ గా మార్చి అందరినీ విస్మయానికి గురి చేసాడు.
అయితే ఈ హెలికాప్టర్ ఎగరలేదు కానీ, హెలికాప్టర్ ఎక్కాలనుకునే వారి కోరిక మాత్రం తీరుస్తుంది.

మొదట సాధారణ ఈవెంట్లకు సదరు కారుని అద్దెకిచ్చిన గుడ్డు శర్మ, పెళ్లి వేడుకలకు డిమాండ్ ఉందని భావించి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.కేవలం పెళ్లి సెలబ్రేషన్స్ కోసమే అద్దెకు ఇస్తూ వధూవరుల కోరికలు తీరుస్తున్నాడు.కాగా సైజులో చిన్నగా కనిపించే నానో కారు బాడీ హెలికాప్టర్‌కు కరెక్ట్ గా యాప్ట్ అయిందని చెబుతున్నాడు గుడ్డూ శర్మ.కాగా అతనికి దీని కోసం రూ.2లక్షలు ఖర్చు అయిందంట.తన ప్రయోగం గురించి చెప్తూ.ఆత్మ నిర్భర్ భారత్, డిజిటల్ ఇండియాకు ఇది ఉదాహరణ అని వివరించాడు.







