ప్రపంచంలో మళ్ళీ కరోనా భయం మొదలయ్యింది.చైనాలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది.
అక్కడ రోజువారి కేసులు అధికంగా రావడంతో పాటు అత్యధిక మరణాలు సంభవిస్తూ ఉండటంతో… భారత్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.ఇలాంటి తరుణంలో ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ గులేరియా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
దేశంలో కరోనా కేసులలో పెరుగుదల లేకపోయినప్పటికీ నిఘా అవసరమని స్పష్టం చేశారు.
ఈ రకంగా అప్రమత్తంగా ఉంటే కేసులు పెరిగినప్పుడు టెస్టులు చేసి… వైరస్ వ్యాప్తి చెందకుండా ఆరికట్టొచ్చని తెలిపారు.
చైనాతో పోలిస్తే ఇండియాలో పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని… ఇందుకు ఒకే ఒక కారణం వ్యాక్సినేషన్ అని చెప్పుకొచ్చారు.మరోపక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నిబంధనలు మళ్లీ అమలులోకి తీసుకొస్తూ ఉన్నాయి.
బహిరంగ ప్రదేశాలలో తప్పనిసరిగా మాస్క్ ధరించే విధంగా… ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఓమిక్రన్ బీఎఫ్ 7 అనే కొత్త వేరియంట్ ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తుంది.
తాజాగా ఈ వేరియంట్ కలిగిన లక్షణాలు ఉన్న వ్యక్తులు గుజరాత్ లో ఇద్దరికీ, ఒడిస్సాలో ఒకరికి గుర్తించారు.కాగా ఈ కొత్త వేరియంట్ తో శ్వాసకోశ సమస్యలు, క్యాన్సర్, దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.







