భీమ్లా నాయక్ బ్యూటీ మౌనికా రెడ్డి సింపుల్ గా ఉంటూనే తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.మౌనికా రెడ్డి తక్కువ సంఖ్యలోనే వెబ్ సిరీస్ లలో నటించినా ఆ వెబ్ సిరీస్ లు కమర్షియల్ గా సక్సెస్ సాధించాయనే సంగతి తెలిసిందే.
మౌనికా రెడ్డి పెళ్లిలో యాంకర్ వర్షిణి సందడి చేశారనే సంగతి తెలిసిందే.మౌనిక పెళ్లిలో వర్షిణి డ్యాన్స్ చేయగా అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వర్షిణి తీన్మార్ డ్యాన్స్ చేయగా వర్షిణి వేసిన స్టెప్పులు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.చీరకట్టులో అందంగా కనిపించిన వర్షిణి తన డ్యాన్స్ స్టెప్పులతో ఎంతగానో ఆకట్టుకున్నారు.వర్షిణి డ్యాన్స్ కు సంబంధించిన ఫోటోలను చూసి వర్షిణిలో ఇంత మంచి డ్యాన్సర్ ఉందా? అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మౌనికా రెడ్డి పెళ్లిలో వర్షిణి మామూలుగా రచ్చ చేయలేదని నెటిజన్లు చెబుతున్నారు.
మౌనికకు క్లోజ్ ఫ్రెండ్స్ లో వర్షిణి ఒకరు కాగా మౌనికకు ఆఫర్లు రావడంలో వర్షిణి పాత్ర కూడా ఉందని తెలుస్తోంది.మౌనికకు వర్షిణి ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా కావడం గమనార్హం.
మౌనిక వర్షిణిల స్నేహం కలకాలం ఇలాగే కొనసాగాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.మౌనిక సందీప్ ల జోడీ బాగుందని ఈ జోడీ జీవితాంతం సంతోషంగా జీవనం సాగించాలని అభిమానులు భావిస్తున్నారు.

వర్షిణి హడావిడి చూసిన కొంతమంది ఇంకా ఎక్కువ హడావిడి చేస్తే నువ్వే పెళ్లి కూతురని అనుకుంటారని కామెంట్ చేసినట్టు తెలుస్తోంది.వర్షిణి డ్యాన్స్ చూసి మౌనిక కూడా స్టెప్పులు వేయడం గమనార్హం.వర్షిణి ప్రస్తుతం ఆఫర్ల ఎంపిక విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.తనకు నచ్చిన ఆఫర్లకు మాత్రమే వర్షిణి ఓకే చెబుతుండటం గమనార్హం.







