వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రాజధానిని మూడు ముక్కలు చేస్తే వికేంద్రీకరణ అవుతుందా అని ప్రశ్నించారు.
ఇప్పటికే అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని విమర్శించారు.మూడు రాజధానులు చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పారు.
మౌలిక సదుపాయాల కల్పన పేరుతో విధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు.మంత్రుల భాషకు, చేష్టలకు పొంతన ఉండటం లేదని వెల్లడించారు.







