ఈ ఇద్దరి ట్రాక్ 'ధమాకా'లో హైలెట్ అట.. డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

వరుసగా రెండు ప్లాపుల తర్వాత మాస్ రాజా రవితేజ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ప్రెజెంట్ రవితేజ చేస్తున్న సినిమాల్లో త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ”ధమాకా” ఒకటి.

 Ravi Teja's Dhamaka Movie Latest Update , Ravi Teja, Dhamaka Movie, Sreeleela, D-TeluguStop.com

ఈ సినిమాను కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.రవితేజ ఈసారి మరింత కాన్ఫిడెంట్ గా సినిమా రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు.

ఈ కథను బాగా నమ్మడంతో ఎప్పుడు లేని విధంగా రవితేజ ధమాకా సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టి మరీ ప్రొమోషన్స్ చేస్తున్నాడు.ఈయన చేస్తున్న ప్రమోషన్స్ కారణంగా ఈ సినిమాపై మరిన్ని హోప్స్ పెరిగి పోయాయి.

ఇక రవితేజ మాత్రమే కాదు టీమ్ కూడా ప్రొమోషన్స్ కోసం రంగంలోకి దిగారు.తాజాగా ప్రొమోషన్స్ లో భాగంగా ఈ సినిమా డైరెక్టర్ త్రినాధరావు నక్కిన ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్నీ షేర్ చేసుకున్నారు.

త్రినాధరావు ఇప్పటి వరకు తెరకెక్కించిన సినిమాల్లో కామెడీ మిస్ అవ్వకుండా చూసుకున్నారు.మరి ఇప్పుడు ధమాకా విషయంలో కూడా ఈయన ఏమాత్రం డిజప్పోయింట్ చేయదట.ఇందులో కూడా ఒక ట్రాక్ ప్రేక్షకులను కట్టి పడేస్తుంది అని చెబుతున్నాడు.ఈ సినిమాలో రావు రమేష్, హైపర్ ఆది కీలక పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.

అయితే వీరిద్దరి మధ్య ఉన్న కామెడీ ట్రాక్ ఆడియెన్స్ ను బాగా అలరిస్తుందట.

మరి ఈ సినిమా విషయంలో ఇప్పటి వరకు అన్ని కూడా పోసిటివ్ వైబ్స్ నే వస్తున్నాయి.అందుకే ఇది మరో క్రాక్ గా నిలిచే అవకాశం ఉందని ఇండస్ట్రీలో కూడా చెప్పుకుంటున్నారు.చూడాలి ఈ సినిమా ఎంత మేర అలరిస్తుందో.

ఇక ఈ సినిమాలో రవితేజకు జోడీగా పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల నటిస్తుంది.అలాగే వివేక్ కూచిభట్ల సహా నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

అలాగే భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమా మేకర్స్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube