తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్రకు అరుదైన గౌరవం దక్కింది.దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీ ఎంపీలకు పాదయాత్రపై ప్రజెంటేషన్ ఇచ్చారు.
అదేవిధంగా బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో పాదయాత్రపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం.ఇటీవల బండి పాదయాత్ర వివరాలు తీసుకురావాలని ఎంపీ లక్ష్మణ్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు.
బీజేపీ సెంట్రల్ పార్టీ నుంచి రాష్ట్ర నాయకత్వానికి ఫోన్ చేశారని తెలుస్తోంది.పవర్ పాయింట్, వీడియో ప్రజెంటేషన్ కు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏర్పాట్లు చేస్తుంది.
ఈ సమావేశంలో మోదీ, అమిత్ షాతో పాటు బీజేపీ ఎంపీలు పాల్గొననున్నారు.







