విజయవాడలో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది.విదేశీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు కొందరు వల విసిరారు.
రూ.కోట్లు దండుకుని ఊడాయించారు.విజయవాడలోని బందరు రోడ్డులో డయల్ ఇనిస్టిట్యూట్ పేరుతో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.ప్రభుత్వ, విదేశీ ఉద్యోగాలు ఇప్పస్తామని టోకరా వేశారని సమాచారం.ఈ క్రమంలోనే ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షల వరకు వసూళ్లకు పాల్పడ్డారు.అనంతరం మోసపోయామని గ్రహించిన సుమారు 30 మంది బాధితులు సూర్యారావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా సాగిస్తున్నారు.







