ప్రస్తుత వింటర్ సీజన్ లో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా దాదాపు అందరి పెదాలు పగిలిపోతుంటాయి.వింటర్ సీజన్ లో పెదాలు పగిలిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి.
అతి ముఖ్యమైన కారణం శరీరంలో తేమ లేకపోవడం.దీని వల్ల చర్మం డ్రైగా మారడమే కాదు పెదాల పగుళ్లు సైతం ఏర్పడతాయి.
పగిలిన పెదాలు అసౌకర్యానికి గురి చేస్తాయి.అలాగే తీవ్ర బాధను కలిగిస్తాయి.
ఈ నేపథ్యంలోనే పగిలిన పెదాలను నివారించుకోవడం కోసం ముప్ప తిప్పలు పడుతుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ సీరం వాడితే కనుక పగిలిన పెదాలను సులభంగా రిపేర్ చేసుకోవచ్చు.
ఇంకెందుకు ఆలస్యం చలికాలంలో పగిలిన పెదాలను రిపేర్ చేసే ఆ మ్యాజికల్ సీరంను ఎలా తయారు చేసుకోవాలి.? దాన్ని ఏ విధంగా వినియోగించాలి.? వంటి విషయాలపై ఓ లుక్కేసేయండి.
ముందుగా ఒక బౌల్ ను తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వేసుకోవాలి.
అలాగే రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ ను వేసి స్పూన్ సహాయంతో కనీసం ఐదు నిమిషాల ఏడు నిమిషాల పాటు మిక్స్ చేయాలి.అనంతరం వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, రెండు టేబుల్ స్పూన్లు గ్లిజరిన్ వేసి మరో మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు స్పూన్ తో బాగా మిక్స్ చేసుకుంటే మన సీరం సిద్ధం అవుతుంది.
ఈ హోం మేడ్ లిప్ సీరంను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజుకు కనీసం రెండు నుంచి మూడు సార్లు పెదాలపై ఈ సీరం ను అప్లై చేసుకుంటూ ఉండాలి.ఇలా చేస్తే కనుక పగిలిన పెదాలు నుంచి ఉపశమనం లభిస్తుంది.అలాగే ఈ హోమ్ మేడ్ లిప్ సీరంను వాడటం వల్ల పెదాలు మృదువుగా, కోమలంగా మారతాయి.
పైగా ఈ మ్యాజికల్ సీరం ను వాడటం వల్ల పెదాల నలుపు సైతం క్రమంగా వదిలిపోతుంది.