Blood group food : మీ బ్లడ్ గ్రూపును బట్టి ఏ ఆహారం తింటే మంచిదో తెలుసా..

భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి కి ఒక్కొక్క బ్లడ్ గ్రూప్ ఉంటుంది.ఇంకా చెప్పాలంటే సాధారణంగా ఎక్కువ మందిలో ఓ పాజిటివ్, ఓ నెగిటివ్, ఏ పాజిటివ్, ఏ నెగిటివ్, బి పాజిటివ్, బి నెగిటివ్, ఏబి పాజిటివ్, ఏ బి నెగిటివ్ అనే 8 రకాల రక్త గ్రూపులు ఉంటాయి.

 Do You Know Which Food Is Best To Eat According To Your Blood Group,  Blood Grou-TeluguStop.com

అయితే ఏ రక్త గ్రూపు కు చెందిన వారు ఏమి తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.ఏ పాజిటివ్ ఏ నెగిటివ్ గ్రూపు వారు మాంసాహారాన్ని తినడం తగ్గించాలి.

ఈ గ్రూపు వారు పండ్లు, కూరగాయలు, బీన్స్, చిక్కుళ్ళు, ధాన్యాలు అధికంగా తీసుకోవడం వల్ల వీరిలో ఉన్న రోగనిరోధక వ్యవస్థ బలపడే అవకాశం ఉంది.ఈ గ్రూపు వాళ్లలో మాంసాహారం ద్వారా శరీరంలో చేరే వైరస్లను విరు తట్టుకోలేరు.

బి రక్త గ్రూపు కలిగిన ప్రజలు ఆకుపచ్చని కూరగాయలు తక్కువ మొత్తంలో మాంసాహారం గుడ్లు, కొవ్వు లేని పదార్థాలను తినడం మంచిది.ఇంకా చెప్పాలంటే మొక్కజొన్నలు, గోధుమలు, టమోటాలు, వేరుశనగలు నువ్వులు తినడం తగ్గించాలి.

ఈ గ్రూపు వారు చికెన్ కి కూడా కాస్త దూరంగా ఉండడమే మంచిది.ఏబి రక్త గ్రూపులు ఉన్న ప్రజలు సముద్రపు ఆహారాన్ని తీసుకోవడం మంచిది.

అలాగే సోయాతో చేసిన పన్నీరు, పాలు, పెరుగు, చీజ్, పన్నీర్, ఆకుకూరలు ధాన్యాలను తినడం మంచిది.

Telugu Tips, Milk, Peanuts, Tomatoes, Wheat-Telugu Health Tips

ఏబి గ్రూపు రక్తం ఉన్న వారిలో కడుపులో ఆమ్లాలు తక్కువగా ఉండడం వల్ల మాంసాహారానికి, ఆల్కహాల్కి దూరంగా ఉండటమే మంచిది.ఇంకా చెప్పాలంటే ఓ రక్త గ్రూప్ కి చెందినవారు అధిక ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడమే మంచిది.ఇందులో చికెన్, లేత గొర్రె మాంసం చేపలు కూరగాయలు తినడం ఎంతో మంచిది.

ఈ బ్లడ్ గ్రూపుల వారికి ఇతర అనారోగ్య సమస్యలు ఉంటే వాటికి తగ్గ ఆహారాన్ని తినడం కూడా మంచిదే.ఉదాహరణకు ఒక వ్యక్తికి షుగర్ ఉన్నట్లయితే వైద్యుని సలహా తీసుకొని వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకొని తినడమే మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube