Mudragada Padmanabam: ఆఫర్లు వస్తున్నా... మౌనంగానే 'ముద్రగడ ' ! మనసులో ఏముందో ? 

ఉన్నట్టుండి కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం  ప్రాధాన్యం ఏపీ రాజకీయాల్లో పెరిగిపోయింది.

ఆయన త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారని , 2024 ఎన్నికల్లో ఆయనతో పాటు,  ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరు పోటీకి దిగుతారనే హడావుడి నడుస్తోంది.

అయితే ఆయన ఏ పార్టీలో చేరుతారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ? అసలు ఆయన కార్యాచరణ ఏంటనేది సరైన క్లారిటీ లేదు.అయితే ఆయనకు జనసేన , బీజేపీ,  వైసీపీ నుంచి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి.

ముద్రగడ పార్టీలో చేరితే ఆయనకు కీలకమైన పదవిని కట్టబెడతామని, అన్ని విషయాల్లోనూ ప్రాధాన్యం కల్పిస్తామని అన్ని ప్రధాన పార్టీలు హామీలు ఇస్తున్నాయి.ముఖ్యంగా ఏపీ అధికార పార్టీ వైసిపి ముద్రగడను చేర్చుకునేందుకు ఉత్సాహంగా ఉంది.

  ఎలాగూ ఆయన టిడిపిలో చేరే అవకాశం లేకపోవడం , ఎన్నికల సమయం నాటికి టిడిపి,  జనసేనలు పొత్తు పెట్టుకునే ఛాన్స్ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్న క్రమంలో,  ఆయన కచ్చితంగా తమ పార్టీలోనే చేరుతారని వైసీపీ ఆశగా ఎదురుచూస్తోంది.ముద్రగడ వంటి చరిష్మా ఉన్న నేతలు తమ పార్టీలో చేరితే , కాపు సామాజిక వర్గం వైసిపికి మరింత దగ్గరవుతుందని , కోస్తా ఆంధ్రాలో మంచి ఆదరణ ఉంటుందని, జనసేన , పవన్ కళ్యాణ్ ప్రభావాన్ని తట్టుకునేందుకు ముద్రగడ పనికొస్తారని వైసీపీ బలంగా నమ్ముతోంది .అందుకే ఆయన వైసీపీ కండువా కప్పుకుంటే , రాబోయే ఎన్నికల్లో ఎంపీ టికెట్ కానీ,  రాజ్యసభ సభ్యత్వం కానీ ఇచ్చేందుకు రెడీ అని రాయబారం పంపినట్లు తెలుస్తోంది.అలాగే ముద్రగడ పద్మనాభం కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించే బాధ్యతను తీసుకుంటామని హామీ కూడా ఇచ్చారట.

Advertisement

కాకపోతే ముద్రగడ మాత్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు కాపు సామాజిక వర్గం నిలబడుతున్నా,  ముద్రగడ గనుక రంగంలోకి దిగితే ఆయన వెంటే నడిచేవారు ఎక్కువమంది ఉంటారని ఆయన కాపు కులం కోసం అవసరమైతే పదవులను కూడా పక్కనపెట్టి పోరాటానికి దిగుతారని నమ్మకం ఆ సామాజిక వర్గంలో ఉండడంతో జనసేన వైపు పూర్తిగా కాపు సామాజిక వర్గం వెళ్లకుండా ముద్రగడ ద్వారా చెక్ పెట్టవచ్చని అంచనాలు వైసిపి ఉందట.అందుకే ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు అంతగా ప్రయాశపడుతోందట.కానీ పొలిటికల్ ఎంట్రీ విషయంలో ముద్రగడ మాత్రం ఇంకా బహిరంగంగా ఏ ప్రకటన చేయకపోవడంతో అన్ని పార్టీలు ఆయన నిర్ణయం ఎలా ఉండబోతుందనే విషయంలో టెన్షన్ పడుతున్నాయి.

 .

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు