అవును, మీరు విన్నది నిజమే.తాజాగా రోహిత్, రాహుల్ ద్రవిడ్ లకు ఇద్దరికీ BCCI నుంచి పిలుపు వచ్చింది.
త్వరలో ముంబయిలో జరిగే ఓ ముఖ్యమైన సమావేశానికి BCCI నుంచి వీరిద్దరికీ పిలుపొచ్చింది.ఈ సమావేశంలో T20 కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ తప్పుకుంటాడా? కోచ్ గా రాహుల్ ద్రవిడ్ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి అన్న విషయంపైన BCCI కీలక నిర్ణయాలు తీసుకోనుందని ఊహాగానాలు వినబడుతున్నాయి.బంగ్లాదేశ్ పర్యటనకు ముందే వీరిద్దరినీ BCCI అధికారులు కలవనున్నారు.
ఇక ఈ విషయంపైన BCCI సీనియర్ అధికారి ఒక వార్తా సంస్థతో తాజాగా మాట్లాడినట్లు భోగట్టా.
సదరు వ్యక్తి మాట్లాడుతూ… “త్వరలోనే రోహిత్, రాహుల్ తో సమావేశం జరగనుంది.వచ్చే ప్రపంచకప్ కోసం కూడా ప్లాన్ చేసుకోవాలి. కెప్టెన్ తో, కోచ్ తో అధికారులు విడివిడిగా మరియు కలిపి భేటీ అయ్యే అవకాశం లేకపోలేదు.ఆ సమావేశం తర్వాత అన్నింటిపై నిర్ణయం తీసుకుంటాం.
త్వరలోనే ఈ విషయాలు మీడియాకు తెలియజేస్తాం.అలాగే ఈ T20 ప్రపంచకప్ ప్రదర్శనపై కూడా సమీక్ష ఉంటుంది.” అని అతను పేర్కొన్నాడు.

ఇకపోతే రోహిత్ శర్మ T20 కెప్టెన్ నుంచి తప్పుకునేందుకు సుముఖంగా ఉన్నాడనే వార్తలు కొన్నిరోజులనుండి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి.దీనిపై రోహిత్ శర్మతో BCCI ఉన్నతాధికారి ఒకరు మాట్లాడారని.హార్దిక్ కు T20 పగ్గాలు అప్పగించటంలో హిట్ మ్యాన్ కు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పినట్లుగా గుసగుసలు వినబడుతున్నాయి.
ఇంకొన్ని రోజులు ఆగితే ఈ విషయాలపై ఓ క్లారిటీ రానుంది.








