Baahubali Bike: బాహుబలిని తలపించే సీన్ ఇది.. బైక్‌ను తలపై మోస్తూ బస్సుపై చేర్చాడు

బాహుబలిని చూసిన వారంతా ఆ సినిమాలో ఎంతో బరువు ఉండే శివలింగాన్ని ప్రభాస్ తన భుజాలపై మోసిన దృశ్యాలు గుర్తుండే ఉంటాయి.నిజజీవితంలో అంత బరువు మోయడం అసాధ్యం.

 This Is A Scene Reminiscent Of Baahubali He Carried The Bike On His Head And Put-TeluguStop.com

అయితే ఓ వ్యక్తి మాత్రం ఎంతో బరువు ఉండే బైకును తన నెత్తిపై చాలా సులువుగా మోశాడు.అంతేకాకుండా నిచ్చెన సాయంతో ఆ బైకును బస్సుపైకి చేర్చాడు.

సాధారణంగా ఎవరైనా పడిపోయిన బైకును పైకెత్తడానికే ఇబ్బంది పడతారు.అలాంటిది ఆ వ్యక్తి అలా అవలీలగా బైకును తన నెత్తిపై మోయడం, ఎత్తులు ఎక్కడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

ప్రస్తుతం పొట్ట కూటి కోసం దేశంలో కోట్లాది మంది రోజూ పనులు చేసుకుంటూ ఉంటారు.ముఖ్యంగా హమాలీ కార్మికులు నిత్యం బరువులు మోస్తూ కుటుంబాన్ని పోషించుకుంటారు.ఇదే కోవలో ఓ బస్టాండులో హమాలీ తన తలపై బాగా బరువుగా ఉండే ఓ బైకును తలకెత్తుకున్నాడు.

ఎంతో బరువు తన తలపై ఉన్నా అతడు ఏ మాత్రం తొణకలేదు.దానిని అలాగే మోసుకుంటూ బస్సు వద్దకు వెళ్లాడు.ఆపై బస్సు వద్ద ఓ నిచ్చెన ఉండడంతో దాని సాయంతో బస్సు పైకి ఎక్కాడు.చాలా భద్రంగా బస్సుపై బైకును చేర్చాడు.

దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇది జార్ఖండ్ రాష్ట్రం రాంచీలోని కట్టా టోలి చౌక్‌లోని ప్రధాన బస్టాండ్‌లో జరిగిన సంఘటన అని సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొన్నారు.

వీడియో చూసిన కొందరు బైక్‌తో ఉన్న యువకుడిని ‘సూపర్‌మ్యాన్’ అని, రియల్ బాహుబలి అని కామెంట్లు చేస్తున్నారు.ఆ వీడియో చూసిన చాలామంది తమ కళ్లను తామే నమ్మలేకపోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube