Balakrishna AP CM : ఏపీకి సీఎం అవుతారా.. ఈ ప్రశ్నకు బాలయ్య సమాధానం ఏంటంటే?

స్టార్ హీరో బాలకృష్ణ ఏపీకి సీఎం కావాలని కోరుకునే ఫ్యాన్స్ సంఖ్య తక్కువేం కాదు.అయితే బాలకృష్ణకు రాజకీయాలపై ఆసక్తి ఉన్నా పదవులపై మాత్రం ఆశ లేదు.

 Balakrishna Shocking Comments About Ap Cm Post Details Here Goes Viral,balakris-TeluguStop.com

తాజాగా బాలయ్య ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.బోయపాటి శ్రీనుతో నేను ఎప్పుడూ గత సినిమాల గురించి, రికార్డుల గురించి చర్చించనని బాలయ్య కామెంట్లు చేయడం గమనార్హం.

అఖండ సినిమా రిలీజ్ సమయంలో ఇబ్బందులు ఉన్నా నిర్మాత ధైర్యం చేసి సినిమాను రిలీజ్ చేశారని ఆయన తెలిపారు.ధైర్యంతో సినిమాను విడుదల చేసి ప్రేక్షకులు థియేటర్లకు రారు అనేవాళ్లకు సమాధానం చెప్పామని బాలకృష్ణ వెల్లడించారు.

అఖండ అనేది ఒకే భాషకు పరిమితమైన సినిమా కాదని బాలయ్య చెప్పుకొచ్చారు.ఆ సినిమా యూనివర్సల్ మూవీ అని బాలయ్య కామెంట్లు చేయడం గమనార్హం.

Telugu Akhanda, Ap Cm, Balakrishna, Boyapati Srinu-Movie

తాను వేర్వేరు రంగాలలో ఉన్నా అన్ని రంగాల విషయంలో సంతృప్తితో ఉన్నానని బాలయ్య అన్నారు.రాబోయే రోజుల్లో సీఎం అవుతారా అనే ప్రశ్నకు బాలయ్య స్పందిస్తూ తనకు అలాంటి ఆశలేం లేవని తెలిపారు.ప్రజాసేవ చేసుకుంటూ వెళతానని దేవుడు అందించే ప్రతిఫలం ఆధారంగా పదవులు వస్తాయని బాలయ్య వెల్లడించారు.సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారని బాలయ్య తెలిపారు.

టాలీవుడ్ సినిమాల బడ్జెట్లు, ప్రొడక్షన్ విలువలలో చాలా మార్పులు వచ్చాయని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.కొన్ని సినిమాలను థియేటర్లలో చూస్తేనే బాగుంటుందని బాలయ్య తెలిపారు.

బాలయ్య ప్రస్తుతం వీరసింహారెడ్డి మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది.

బాలయ్య కెరీర్ లోనే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా భారీ మొత్తానికి ఈ సినిమా రైట్స్ అమ్ముడయ్యాయి.ఈ సినిమా పెద్ద హిట్ కావాలని బాలయ్య అభిమానులు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube