టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన నిఖిల్ కు కార్తికేయ2 సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ లభించడంతో పాటు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు దక్కింది.ఈ సినిమా సక్సెస్ వల్ల నిఖిల్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు కూడా ఇతర భాషల్లో భారీగా బిజినెస్ జరిగే అవకాశం ఉంది.
త్వరలో 18 పేజెస్ సినిమాతో నిఖిల్ ప్రేక్షకుల ముందుకు రానుండగా నిఖిల్, అనుపమ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అందమైన ప్రేమకావ్యంగా తెరకెక్కింది.
సుకుమార్ ఈ సినిమాకు తన వంతు సహాయసహకారాలు అందించడంతో ఈ సినిమాకు భారీ రేంజ్ లో బిజినెస్ జరుగుతోంది.కార్తికేయ2 సక్సెస్ తో నిఖిల్ కొత్త సినిమాలకు బడ్జెట్ పెరిగిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది.అయితే ఇదే సమయంలో నిఖిల్ వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వస్తుండటం నిఖిల్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోంది.
నిఖిల్, పల్లవి టాలీవుడ్ క్యూట్ జోడీలలో ఒక జోడీ కాగా వీళ్లిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని నిఖిల్ పల్లవి విడాకులు తీసుకుంటారంటూ ప్రచారం జరుగుతోంది.వైరల్ అవుతున్న వార్తలు నిఖిల్ దృష్టికి కూడా రావడంతో ఈ వార్తల గురించి నిఖిల్ ఒక ఫోటో ద్వారా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
గోవాలో పల్లవితో కలిసి దిగిన ఫోటోలను నిఖిల్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో పాటు పల్లవితో ఉన్న ప్రతి క్షణం అద్భుతమే అని చెప్పుకొచ్చారు.

నిఖిల్ భార్య పూర్తి పేరు పల్లవి వర్మ కాగా 2020 సంవత్సరంలో నిఖిల్ పల్లవిలకు వివాహం జరిగింది.ప్రేమించి పెళ్లి చేసుకున్న నిఖిల్ పల్లవి అన్యోన్యంగా ఉన్నా ఈ జోడీ గురించి కొన్ని ఫేక్ వార్తలు ఈ మధ్య కాలంలో ప్రచారంలోకి వస్తున్నాయి.నిఖిల్ పల్లవి కలిసి పలు ఇంటర్వ్యూలలో పాల్గొనగా ఆ ఇంటర్వ్యూలకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.







