నందమూరి బాలకృష్ణ ప్రెజెంట్ ఫుల్ స్పీడ్ తో సినిమాలు చేస్తున్నాడు.అఖండ సినిమా విజయం తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమాను స్టార్ట్ చేసాడు.
శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రెజెంట్ షూటింగ్ జరుపు కుంటుంది.మైత్రి మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య తన 108 వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నాడు.వరుస హిట్స్ తో జోరు మీద ఉన్న అనిల్ ఈసారి బాలయ్యను సరికొత్తగా చూపించ డానికి రెడీ అవుతున్నాడు.
అనిల్ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేసి బాలయ్య కోసం ఎదురు చూస్తున్నాడు.ఇలా చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంటూనే.
టాక్ షోకు వ్యాఖ్యాతగా కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
ఈ టాక్ షోలో బాలయ్య పలు ఆసక్తికర విషయాలను ఫ్యాన్స్ తో పంచుకుంటున్నాడు.
మరి ఈ వేదికపైనే ఆదిత్య 369 సీక్వెల్ పై ప్రకటన కూడా ఇచ్చిన విషయం విదితమే.ఈ సీక్వెల్ ను ఆదిత్య 999 మ్యాక్స్ పేరుతో తెరకెక్కిస్తున్నట్టు తెలిపాడు.
అంతేకాదు ఈ సినిమా కథను తానే స్వయంగా సిద్ధం చేసినట్టు చెప్పి మరింత సంచలనం సృష్టించాడు.

ఇలా ఈ సినిమాపై ముందుగానే క్యూరియాసిటీ పెంచుతూ పోతున్న బాలయ్య తాజాగా ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో అని ఈ టాక్ షోలో ప్రకటించాడు.వచ్చే ఏడాది ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళుతున్నట్టు తెలిపారు.ఈ సినిమాకు డైరెక్టర్ గా కూడా ఈయనే పని చేస్తాడా లేదంటే వేరే డైరెక్టర్ తో చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.
మరి బాలయ్య మొదటిసారి కలం పట్టి రాసిన కథ ఎలా ఉంటుంది అనే ఆసక్తి అందరిలో నెలకొంది.







