సుడిగాలి సుధీర్ రష్మీ కలిసి చేసిన షోలు దాదాపుగా సక్సెస్ అయ్యాయనే సంగతి తెలిసిందే.ఈటీవీ షోలకు సుడిగాలి సుధీర్ దూరం కావడంతో గత కొన్ని వారాలుగా సుడిగాలి సుధీర్, రష్మీ ఒకే వేదికపై కనిపించడం లేదు.
అయితే తాజాగా బొమ్మ బ్లాక్ బస్టర్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్ కు సుడిగాలి సుధీర్ గెస్ట్ గా హాజరై సందడి చేశారు.ఈ ఈవెంట్ లో సుధీర్ రష్మీని రష్మీగారు అంటూ సంబోధించడం గమనార్హం.
“నేను చనిపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలీదు కానీ నువ్వు ఏడిస్తే మాత్రం నేను చనిపోతా” అంటూ రష్మీ గురించి సుధీర్ చెప్పే డైలాగ్ ఊహించని స్థాయిలో పాపులర్ అయింది.ఈ డైలాగ్ పౌరాణిక పద్యంలా చెప్పాలని ధనరాజ్ సూచించగా సుధీర్ అదే విధంగా చెప్పారు.
సుధీర్ డైలాగ్ చెబుతున్న సమయంలో రష్మీ సిగ్గు పడుతూ వెరైటీగా ఎక్స్ ప్రెషన్లు ఇవ్వడం గమనార్హం.వాస్తవానికి సుడిగాలి సుధీర్, రష్మీ మధ్య ప్రేమ లేదు.సుడిగాలి సుధీర్ మాత్రం నిజంగా రష్మీపై ప్రేమ ఉందనేలా ప్రవర్తిస్తున్నారు.జబర్దస్త్ షోకు రేటింగ్ పెరగడానికి సుధీర్ రష్మీ మధ్య ఏదో ఉందనే విధంగా దర్శకులు ప్రచారం చేయడం గమనార్హం.
రష్మీ సుధీర్ జోడీ బుల్లితెరపై కలిసి కనిపించినా వెండితెరపై మాత్రం కలిసి కనిపింకలేదు.రాబోయే రోజుల్లో వీళ్లిద్దరూ వెండితెరపై కూడా కలిసి కనిపిస్తారేమో చూడాల్సి ఉంది.
జబర్దస్త్ కు సుధీర్ రీఎంట్రీ ఉంటుందని ప్రచారం జరుగుతున్నా ఆ ప్రచారంలో నిజానిజాలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.
సుధీర్ ప్రస్తుతం ఆహా ఓటీటీలోని కామెడీ షోతో బిజీ అవుతుండగా రష్మీ ఈటీవీ ఛానల్ లోని షోలతో బిజీగా ఉన్నారు.సుడిగాలి సుధీర్ నెలకు 10 లక్షల రూపాయలకు పైగా సంపాదిస్తున్నారని సమాచారం.సుడిగాలి సుధీర్ రేంజ్ లో సంపాదిస్తున్న జబర్దస్త్ కమెడియన్ల సంఖ్య తక్కువగానే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.