కల్పిక గణేష్ అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సమంతకు అక్క పాత్రలో నటించిన నటి అంటే మాత్రం అందరికీ టక్కున ఈమె గుర్తుకు వస్తారు.కల్పిక గణేష్ గత కొద్ది రోజులుగా కమెడియన్ అభినవ్ తో పెద్ద ఎత్తున గొడవ పడుతూ సోషల్ మీడియా వార్తలు నిలుస్తున్నారు.
ఓ కార్యక్రమంలో భాగంగా కల్పిక బెస్ట్ సపోర్టింగ్ పాత్రలో నటించినందుకు అవార్డు అందుకోవడంతో అభినవ్ వ్యంగ్యంగా కామెంట్లు చేశారు.ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య సోషల్ మీడియాలో వార్ మొదలైంది.
అభినవ్ మహిళలను కించపరుస్తూ మాట్లాడారని తాను క్షమాపణలు చెప్పాలనీ ఈమె డిమాండ్ చేశారు.
ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె ఇండస్ట్రీలో ఉన్నటువంటి క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా కల్పిక మాట్లాడుతూ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ ఉందన్న మాట వాస్తవమే అయితే ఇలాంటి ఇబ్బందులను ప్రతి ఒక్కరు ఎదుర్కోరని అది పూర్తిగా వారి వ్యక్తిగత విషయం అంటూ ఈమె కామెంట్ చేశారు.ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదురైనప్పుడు కొందరు ఎన్నో ఇబ్బందులు పడుతూ పూర్తిగా ఈ విషయాన్ని ఖండిస్తారు మరి కొందరు మాత్రం ఇష్టపూర్వకంగానే కమిట్మెంట్ ఇస్తూ ఉంటారు.
ఇలా ఇష్టంతో కమిట్మెంట్ ఇచ్చే వారి విషయంలో క్యాస్టింగ్ కౌచ్ తప్పుగా అనిపించదని బలవంతంగా కమిట్మెంట్ అడగడం పూర్తిగా తప్పు అంటూ ఈమె కామెంట్ చేశారు.ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తొందరగా డబ్బులు సంపాదించాలన్న లేదంటే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందాలన్నా చాలామంది ఇలాంటి కమిట్మెంట్లకు లొంగుతుంటారనీ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇద్దరికీ ఇష్టమే అయితే కాస్టింగ్ కౌచ్ ఏ మాత్రం తప్పు కాదంటూ కల్పిక చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.