స్టార్ హీరో ప్రభాస్ కు భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు.ప్రభాస్ నటించి ఈ ఏడాది విడుదలైన రాధేశ్యామ్ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా ఆదిపురుష్ పై పరవాలేదనే స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.
ప్రభాస్ ఈ సినిమాలో రాముని పాత్రలో నటిస్తుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ఆదిపురుష్ టీజర్ కు ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిందనే విషయం తెలిసిందే.
అయితే ప్రభాస్ అభిమానులకు తాజాగా మరో షాక్ తగిలింది.ఆదిపురుష్ మూవీ నిడివి గురించి వైరల్ అవుతున్న వార్తలు ప్రభాస్ అభిమానులను మరింత టెన్షన్ పెడుతుండటం గమనార్హం.
ఆదిపురుష్ మూవీ నిడివి ఏకంగా 3 గంటల 15 నిమిషాలు అని తెలుస్తోంది.ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులు యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలు మినహా మిగతా సినిమాలను ఇంత నిడివితో చూడటానికి ఇష్టపడటం లేదు.
ఈ మధ్య కాలంలో మరికొన్ని సినిమాలకు నిడివి మైనస్ అయ్యి సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా సినిమా ఫ్లాప్ గా నిలిచిన సందర్భాలు సైతం ఉన్నాయనే సంగతి తెలిసిందే.ఆదిపురుష్ నిడివి వల్ల ప్రభాస్ అభిమానులకు మరో షాక్ తప్పదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం.
ఆదిపురుష్ సినిమా ఏకంగా 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది.
ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో కృతిసనన్ నటిస్తుండగా ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.ప్రభాస్ ఈ సినిమాతో బాలీవుడ్ లో తనకు క్రేజ్ మరింత పెరుగుతుందని అనుకుంటున్నారు.ప్రభాస్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
సోషల్ మీడియాలో ప్రభాస్ కు భారీ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా ప్రభాస్ తర్వాత ప్రాజెక్ట్ లతో భారీ సక్సెస్ ను సొంతం చేసుకుంటాడో లేదో చూడాల్సి ఉంది.