లోకేష్ కనగరాజ్. ఈ పేరు ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషన్ అనే చెప్పాలి.
ఎందుకంటే ఇతడు ‘విక్రమ్’ సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుని దేశ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నాడు.విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ కు కూడా బ్లాక్ బస్టర్ అందించి కోలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు.
ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని ఇండస్ట్రీలలో సూపర్ హిట్ గా నిలిచి రికార్డ్ కలెక్షన్స్ సాధించింది.
ఇక ఈ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ ఎవరితో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో లోకేష్ విజయ్ దళపతి తో సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు.
వీరి కాంబోలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కనుంది.విజయ్ కెరీర్ లో 67వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై తాజాగా లోకేష్ ఒక అప్డేట్ ఇచ్చాడు.తాజాగా లోకేష్ ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి చెప్పుకొచ్చాడు.
ఈ సినిమాపై డిసెంబర్ లో ఒక బ్లాస్టింగ్ అప్డేట్ ఉంటుందని.
అలాగే షూట్ కూడా డిసెంబర్ లోనే స్టార్ట్ చేస్తున్నట్టు కూడా చెప్పుకొచ్చాడు.మరి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూసే అభిమానులకు ఇది పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

ప్రస్తుతం విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 66వ సినిమాను చేస్తున్నాడు.ఈ సినిమాను దిల్ రాజు భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తుండగా.రష్మిక నటిస్తుందని హీరోయిన్ గా నటిస్తుంది.
తమిళ్ లో ‘వరిసు’ తెలుగులో ‘వారసుడు’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ క్రేజీ బైలింగ్వన్ సినిమాపై ఇప్పటికే అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.
ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.సంక్రాంతికి ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.ఇక ఈ సినిమాతో విజయ్ తెలుగు మార్కెట్ పై పట్టు సాధించాలని చూస్తున్నాడు.చూడాలి ఎంత హిట్ అవుతుందో.







