బేసిగ్గా అందరూ మొబైల్ ఫోన్‌లో గూగుల్ డ్రైవ్ వాడుతూ వుంటారు.డెస్క్‌టాప్ వర్షన్ ఈమధ్యకాలంలో వాడటం తగ్గించేశారు.
ముఖ్యంగా దీన్ని వాడటం వలన గూగుల్ డ్రైవ్‌లో స్టోర్ అయిన ఫైళ్లను విండోస్ లేదా మ్యాక్‌ఓఎస్ కంప్యూటర్‌లోని ఫైల్ సిస్టమ్‌తో కరెక్టుగా సింక్ అయ్యేలా చేస్తుంది.సుమారు నాలుగు సంవత్సరాల తరువాత డ్రైవ్ డెస్క్‌టాప్ సాఫ్ట్‌వేర్‌ను తిరిగి అప్‌డేట్ చేస్తున్నారు.
ఇప్పుడిది డ్రైవ్ ఫర్ డెస్క్‌టాప్ రూపంలో కనిపిస్తుంది.డ్రాప్‌బాక్స్, వన్‌డ్రైవ్, ఐక్లౌడ్ వంటి క్లౌడ్ స్టోరేజీగా మాత్రమే కాకుండా పూర్తిస్థాయిలో ఫైల్ సింకింగ్ వ్యవస్థగా ఉపయోగపడుతుంది.
దీనిని వాడేటప్పుడు హార్డ్‌డ్రైవ్‌లోని డాక్యుమెంట్లు వెబ్‌లో కూడా అందుబాటులో ఉంటాయి.కంప్యూటర్ ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు లేదా ఇంటర్నెట్ కనెక్షన్ స్లో అయినప్పుడు కూడా గూగుల్ డ్రైవ్ ఫోల్డర్‌లో స్టోర్ అయిన HD వీడియోలను ఇపుడు చూసుకొనే వీలుంది.
అలాగే అప్‌లోడింగ్ అనేది కూడా చాలా వేగవంతంగా జరుగుతుంది.USB వంటి ఎక్స్‌టర్నల్ డ్రైవ్‌ల నుంచీ ఫైళ్లను కూడా అప్‌లోడ్ చేసుకోవచ్చు.

అంతేకాకుండా రెండో కంప్యూటర్ వున్నవాళ్లు కూడా దీనిని మరింత బాగా ఉపయోగించుకోగలరు.రెండు పీసీల మధ్య సింక్ అయిన ఫైళ్లు, ఫోల్డర్లలో అన్నింటిని గానీ కొన్నింటిని గానీ అలాగే ఉంచుతుంది.ఇదే దాని ప్రత్యేకత.అంతేకాకుండా ఇది దశాబ్దాలపాటు ఫైళ్లను పాడవకుండా చాలా జాగ్రత్తగా భద్రపరుస్తుంది.దీని వినియోగం చాలామందికి తెలిసినప్పటికీ పూర్తి స్థాయిలో వాడటం లేదని సర్వేలు చెబుతున్నాయి.అందుకే గూగుల్ వాటి ఉపయోగాలు చెబుతూ అన్ని స్థాయిలవారు దీనిని ఉపయోగించడానికి ఇపుడు పలుచోట్ల వర్క్ షాప్స్ నిర్వహిస్తోంది.







