మన దేశంలో చాలా ఎక్కువ మంది ఇండ్లలో రకరకాల మొక్కలను పెంచుతూ ఉండారు.కొంతమంది ఆ మొక్కలను పెరట్లో కూడా పెంచుతూ ఉంటారు.
ఇంకా చెప్పాలంటే ఇంటి ముందు పూల మొక్కలతో పాటు బిళ్ల గన్నేరు మొక్క ను పెంచుతూ ఉంటారు.ఈ మొక్కకు ఉన్న విశేషత ఏమిటంటే ఇది జీవితకాలం పూలు పూస్తూనే ఉంటుంది.
కాబట్టి దీనిని నిత్యపుష్పి, సదా పుష్పి అనే పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు.బిళ్ల గన్నేరు మొక్క వల్ల కలిగే ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మొక్క అధిక రక్తపోటు, ముక్కు నుంచి రక్తం కారడం, దంతాలు చిగుళ్లలో రక్తం కారడం, నోట్లో పుండ్లు ఏర్పడడం, గొంతు రాసుకో పోవడం లాంటి ఎన్నో సమస్యలను బిళ్ళ గన్నేరు మొక్క సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.అంతేకాకుండా పురుగులు కీటకాలు కుట్టినప్పుడు బిళ్ల గన్నేరు ఆకులను పేస్టుగా చేసి రాయడం వల్ల ఎర్రదనం, వాపు తగ్గే అవకాశం ఉంది.
కందిరీగ కుట్టిన చోట, పాము కుట్టిన చోట కూడా బిళ్ల గన్నేరు మొక్క ఆకు పేస్టు రాయడం వల్ల కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.ప్రస్తుత సమాజంలో చాలామంది ప్రజలను వేధిస్తున్న అనారోగ్య సమస్యలలో చక్కెర వ్యాధి కూడా ఉంది.
ఈ వ్యాధిని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు దీనికోసం ముందుగా బిళ్ల గన్నేరు మొక్క వేర్లను తీసుకొని శుభ్రంగా కడిగే ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి.ముందుగా శుభ్రపరచుకున్న వేరు మొక్కలను వేసి సగం నీరు అయ్యేవరకు బాగా మరిగించాలి.
ఆ తర్వాత ఈ నీటిని వడగట్టి ఒక గ్లాసులోకి తీసుకోని, నీటిలో మిరియాల పొడిని వేసి కలిపి తాగాలి.ఇలా ప్రతిరోజూ తీసుకోవడం వల్ల 48 రోజుల్లో షుగర్ స్థాయిల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది.ఇలా సంవత్సరానికి రెండు లేదా మూడు సార్లు చేస్తే క్యాన్సర్ వస్తుందన్న భయాన్ని పక్కన పెట్టేయోచ్చు.దీనిని ఆయుర్వేద వైద్యున్ని పర్యవేక్షణలో పాటిస్తే మంచిది.అయితే గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు మాత్రం వీటిని తినకూడదు.