తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ తో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సమావేశం అయ్యారు.మునుగోడు ఉపఎన్నిక నిర్వహణపై ఈసీ అధికారులు చర్చించారు.
పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది.ఈ క్రమంలో బీహెచ్ఈఎల్ లో ఈవీఎంలను నితీశ్ వ్యాస్ తనిఖీ చేశారు.
అయితే ఇవి రొటీన్ తనిఖీలు అని ఈసీ రాష్ట్ర అధికారులు చెబుతున్నారు.మునుగోడు ఉపఎన్నికను అటు ఎన్నికల సంఘం అధికారులతో పాటు ఇటు అన్ని పార్టీల నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే.







