భారతదేశంలో 5జీ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.ఈ నేపథ్యంలో 5జీ ఫోన్ కొనాలని చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.
ఇదే సమయంలో దసరా, దీపావళి పండుగలు రావడంతో 5జీ ఫోన్లపై ఆకర్షణీయమైన డీల్స్, డిస్కౌంట్లను కంపెనీలు ప్రకటించాయి.ప్రముఖ చైనీస్ మొబైల్ బ్రాండ్ రియల్మీ కూడా తన 5జీ స్మార్ట్ ఫోన్లపై బంపరాఫర్ ప్రకటించింది.
ఈ కంపెనీ తన ప్రీమియం ఫోన్లపై అధిక డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నట్లు తాజాగా వెల్లడించింది.రియల్మీ ఈ నెల 26-31 తేదీలలో ‘రియల్మీ ఫెస్టివ్ డేస్ సేల్’ నిర్వహించనుంది.కాగా ఈ సేల్‌కి ముందే రియల్మీ జీటీ 2 ప్రో (Realme GT2 Pro) ఫోన్లపై రూ.5వేలు డిస్కౌంట్ అందించడం ప్రారంభించింది.రియల్మీ జీటీ 2 ప్రో 8జీబీ ర్యామ్+ 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.49,999 కాగా రూ.44,999కే కంపెనీ తీసుకొచ్చింది.ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుదారులు రూ.3వేల ఎక్స్ట్రా డిస్కౌంట్ పొంది దీని ధరను మరింత తగ్గించుకోవచ్చు.ఈ ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్ అక్టోబర్ 16 వరకే వర్తిస్తుందని గమనించాలి.
అలాగే ఈ ఫోన్ ఆఫర్ వివరాలు పూర్తిగా తెలుసుకునేందుకు రియల్మీ అధికారిక వెబ్సైట్ విజిట్ చేయాలి.
రియల్మీ జీటీ 2 ప్రో ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో 5000ఏఎంహెచ్ బ్యాటరీ, 6.7 అంగుళాల 2కే ఎల్టీపీవో అమోలెడ్ డిస్ప్లే, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 1 ప్రాసెసర్ అందించారు.ఇది 50ఎంపీ మెయిన్ కెమెరా, 50ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపీ మ్యాక్రో కెమెరా, 32ఎంపీ ఫ్రంట్‌తో వస్తుంది.ఇక ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లో రియల్ మీ 9 5జీ ఆరువేల డిస్కౌంట్‌తో రూ.14,999లకే లభిస్తోంది.