ఆ ఇద్దరి కంటెస్టెంట్ల వీడియోలు సిద్ధం చేసిన బిగ్ బాస్.. డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్ తనే?

తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం 5 వారాలను పూర్తి చేసుకుంది.ఇక రేపటితో ఆరవ వారం కూడా పూర్తికానున్నది.21 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ కార్యక్రమం నుంచి ఇప్పటికే ఐదు మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు ఇక ఆరవ వారానికి సంబంధించిన ఎలిమినేషన్ గురించి ఇప్పటికే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఆరవ వారం నామినేషన్ లో భాగంగా మొత్తం తొమ్మిది మంది కంటెస్టెంట్లు నామినేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే.

 Rajasekhar And Sudeepa Danger Zone In Bigg Boss Season 6 Show Details, Rajasekha-TeluguStop.com

ఈ విధంగా 9 మంది కంటెస్టెంట్ నామినేషన్ లో ఉండగా శుక్రవారంతో ఓటింగ్ సెషన్ ముగియడంతో డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్లు ఎవరు ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్ళనున్నారు అనే విషయంపై తీవ్ర స్థాయిలో ఉత్కంఠత ఏర్పడింది.ఇకపోతే ఆరవ వారం నామినేషన్ లో ఉన్నటువంటి 9 మంది కంటెస్టెంట్లతో మొదటి స్థానంలో శ్రీహాన్ నిలబడగా రెండవ స్థానంలో ఆదిరెడ్డి ఉన్నారు.

ఇక మూడు నాలుగు స్థానాలలో కీర్తి , గీతూ రాయల్ ఉండగా ఐదవ స్థానంలో బాలాదిత్య, శ్రీ సత్యఆరో స్థానంలో ఉన్నారు ఇక ఏడవ స్థానంలో ఇనయ ఓట్లను సంపాదించుకొని సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయారు.

Telugu Bb Sixth, Bigg Boss, Biggboss, Galataa Geethu, Nagarjuna, Rajasekhar, Sud

ఇకపోతే ఇద్దరు కంటెస్టెంట్లు డేంజర్ జోన్ లో ఉన్నారని ఏడవ జోన్ లో మోడల్ రాజశేఖర్ ఉండగా ఎనిమిదవ స్థానంలో చైల్డ్ ఆర్టిస్ట్ సుదీప ఉన్నారు.ఇప్పటికే ఈ ఇద్దరి కంటెస్టెంట్లకు సంబంధించిన స్పెషల్ వీడియోలు కూడా బిగ్ బాస్ నిర్వాహకులు సిద్ధం చేసి పెట్టారని వీరిద్దరిలో ఎవరో ఒకరు ఈ వారం బిగ్ బాస్ హౌస్ వీడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఆరవ వారం సుదీప బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్లనున్నట్లు సమాచారం.

మరి ఈమె నిజంగానే ఎలిమినేట్ అవుతుందా లేకపోతే సేఫ్ జోన్ లోకి వెళ్తుందా అనే విషయం తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి ఉండాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube