అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఛేజింగ్లో అత్యధికంగా 300 సార్లు విజయం సాధించిన జట్టుగా టీమిండియా అరుదైన రికార్డు సృష్టించింది.సౌతాఫ్రికాతో రెండో వన్డేలో గెలుపుతో ఈ ఘనత సాధించింది.ఈ దరిదాపుల్లో కూడా ఏ జట్టు లేకపోవడం గమనార్హం.ఆస్ట్రేలియా(257), వెస్టిండీస్(247) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పర్యాటక జట్టు ప్రొటిస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది కేశవ్ మహరాజ్ బృందం.
లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు గొప్ప ఆరంభం లభించలేదు.కెప్టెన్ శిఖర్ ధావన్ (13), మరో ఓపెనర్ శుభ్ర్మన్ గిల్ (28) స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయారు.