కేసీఆర్ జాతీయ పార్టీ ... ఏపీలో సందడే సందడి !

తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త జాతీయ పార్టీని ప్రకటించేశారు.దానికి బీఆర్ఎస్ అని పేరు కూడా పెట్టేశారు.

21 ఏళ్లుగా ఉన్న టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితి లో విలీనం చేసేశారు.దేశవ్యాప్తంగా కెసిఆర్ పార్టీపై అన్ని రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.

ఇక కొన్ని రాష్ట్రాల్లో ముందుగా ఎన్నికల్లో పోటీ చేసి క్రమక్రమంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పోటీ చేయాలని,  బిజెపికి రాజకీయ ప్రత్యామ్నాాయంగా భారత్ రాష్ట్ర సమితిని బలోపేతం చేయాలని కెసిఆర్ ప్లాన్ చేస్తున్నారు.ఇప్పటికి దీనిపై తెలంగాణలోనూ ఆసక్తికరమైన చర్చ జరుగుతుండగానే.

పక్కనే ఉన్న ఏపీలో టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హడావుడి నెలకొంది.కేసీఆర్ పార్టీ ప్రకటించగానే ఏపీలో హడావుడి మొదలైంది.

Advertisement

ఫ్లెక్సీలు, పోస్టర్లతో కొంతమంది హడావుడి చేయడమే కాకుండా, రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున అభ్యర్థులుగా ప్రకటించుకుంటూ.ప్లెక్సీలు బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది.

విజయవాడలో బండి రమేష్ అనే వ్యక్తి పెద్ద ఎత్తున పోస్టర్ లను అనేక ప్రాంతాల్లో అంటించారు. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురంలోనూ బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి.

అంతేకాకుండా ఆ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా అమ్మాజీ అనే పేరుని కూడా ప్రకటించుకుని అనేక ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.ఇక ఎక్కడిక క్కడ ఇదే రకమైన హడావుడ కనిపిస్తోంది. 

ప్రస్తుతం ఏపీలో టిడిపి, వైసిపి, బిజెపి, జనసేన వంటి పార్టీలు ఉన్నాయి.రాబోయే ఎన్నికల్లో అధికారం దక్కించుకునేందుకు ఈ పార్టీలన్నీ పోటీపడుతున్నాయి.అయితే అనూహ్యంగా ఇప్పుడు కేసీఆర్ జాతీయ పార్టీ తెరపైకి రావడం, ఏపీ లోను పోటీ చేసేందుకు సిద్ధమంటూ ప్రకటనలు చేయడంతో మిగిలిన రాజకీయ పార్టీల్లో ఆందోళన మొదలైంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈ పరిణామాలపై ఆందోళన చెందుతోంది.కేసీఆర్ పార్టీ అంటూ ఏపీలో పోటీ చేస్తే దెబ్బ తినేది ఏ పార్టీ అనే టెన్షన్ టిడిపిలో నెలకొంది.

Advertisement

కెసిఆర్ పార్టీపై చంద్రబాబు స్పందించకపోయినా,  ఆ పార్టీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అనేక విమర్శలు చేశారు.మొత్తంగా ఏపీలో బీఆర్ ఎస్ పార్టీ కి సంబందించిన సందడి మొదలయ్యింది.

తాజా వార్తలు