పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో సంప్రదాయరీతిలో ఆయుధ పూజ కార్యక్రమం పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ కుటుంబ సమేతంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ మాట్లాడుతూ శక్తికి ప్రతీకగా నిలిచే దుర్గామాత సమక్షంలో ప్రతి ఆయుధానికి ఎంతో శక్తి కలిగి ఉంటుందని, విజయం చేకూర్చే విజయదశమి పర్వదినాని పురస్కారించుకొని జిల్లాలో ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, పోలీసుల గౌరవం, కీర్తిప్రతిష్టలు పెంపొందించాలని ఆకాంక్షించారు.
పోలీస్ కమిషనర్ సతీమణి హృదయ మేనన్ గారితో కలసి ఆయుధ పూజ కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, పోలీస్, హోంగార్డు అధికారులకు విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్, అడిషనల్ డీసీపీ ఏఆర్ కుమారస్వామి, ACP లు రామోజీ రమేష్, అంజనేయులు, ప్రసన్న కుమార్, సిఐలు చిట్టిబాబు బాబు, సర్వయ్య, రామకృష్ణ , అంజలి, ఆశోక్ కుమార్, RI లు శ్రీనివాస్ , సాంబశివరావు, శ్రీశైలం, ఆర్మూరర్స్ సంఘయ్య, శేఖర్ రావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.







