ఇంటర్నెట్ ప్రపంచంలో ఎప్పుడు, ఎలాంటి వీడియో లేదా పోస్ట్ వైరల్ అవుతుందో చెప్పలేం.వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని షాకింగ్ గా ఉంటాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ పనస పండ్ల చెట్టుకు సంబధించిన వీడియో వైరల్ అవుతోంది.ఈ చెట్టు ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.
మరీ ఆ చెట్టులో అంత ప్రత్యేక ఏముందని అనుకుంటున్నారా?.అవును.
ఆ చెట్టు ప్రత్యేకమే.ఎందకంటే అది 200 ఏళ్ల నాటి చెట్టు.
అందుకే ఆ చెట్టుకు అంత ప్రాముఖ్యత ఉంది.ఈ చెట్టు తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఉంది.
ఈ చెట్టును చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి జనాలు వస్తుంటారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అపర్ణా కార్తికేయన్ అనే ట్విట్టర్ యూజర్ ఆ చెట్టుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.‘ఇది 200 ఏళ్ల నాటి జాక్ ఫ్రూట్ చెట్టు.తమిళనాడులోని కడలూరులో ఇది ఒక వీఐపీ.చెట్టు ముందు నిలబడటం, చుట్టూ నడబడం గౌరవప్రదంగా భావిస్తారు’ అంటూ రాసుకొచ్చారు.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.ఈ వీడియో షేర్ చేయబడినప్పటి నుంచి వేల వ్యూస్, వందల కొద్ది లైక్ లతో దూసుకుపోతుంది.
ఈ వీడియోలో చెట్టుకు పనస పండ్లు వేలాడుతూ కనిపిస్తాయి.ఈ చెట్టు భారీగా అనేక కొమ్మలతో ఉంది.వెడల్పాటి, పొడవాటి, ఫలవంతమైన చెట్టును పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా(PARI) జాక్ ఫ్రూట్ చెట్టుగా అభివర్ణించింది.ఈ చెట్టు చుట్టూ తిరగడానికి 25 సెకన్లు పడుతుంది.
దాదాపు 100 పనస పండ్లను ఈ చెట్టుకు చూడవచ్చు.ప్రపంచంలోని అతిపెద్ద పండ్లలో జాక్ ఫ్రూట్ ఒకటి.
ఇది దక్షిణ భారతదేశంలోని పశ్చిమ కనుమలలో పెరుగుతుంది.ఈ పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
దీని రేటు కూడా ఎక్కువగానే ఉంటుంది.







