సైరన్ మోగగానే అలర్ట్.. ఫోన్లు, టీవీలు ఆపేస్తున్న ఆ గ్రామస్థులు..!

ఈ రోజుల్లో అన్ని పనులకు ప్రజలు ఎక్కువగా ఆన్‌లైన్ సర్వీసుల మీదే ఆధారపడుతున్నారు.ఇంటర్నెట్‌లో ప్రతిదీ ఆర్డర్ చేస్తూ లగ్జరీ లైఫ్ గడుపుతున్నారు.

 Maharashtra Sangli Village People Digital Detox After 7 Pm Details, Digital Deto-TeluguStop.com

థియేటర్లకు వెళ్లకుండా ఎంచక్కా ఇంట్లోనే స్మార్ట్‌ఫోన్‌లలో సరికొత్త సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.అయితే ఈ క్రమంలో వారికి నిద్రలేమి సమస్యలు వస్తున్నాయి.

అంతేకాదు, ఫోన్ల నుంచి వచ్చే రేడియేషన్ బ్రెయిన్‌పై కూడా ఎక్కువ ఎఫెక్ట్ చూపుతోంది.ఈ నేపథ్యంలో టెక్ నిపుణులు ఫోన్లకు కాస్తా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే డిజిటల్ డిటాక్స్‌ను తూచా తప్పకుండా ఫాలో అయ్యేందుకు ఒక ఊరి ప్రజలు ఒక వినూత్న ఆలోచన చేశారు.వీరు తమ గ్రామంలో రోజూ సాయంత్రం 7 గంటలకు సైరన్ మోగించాలని నిర్ణయించారు.

ఆ సైరన్ మోగిన వెంటనే గ్రామ ప్రజలందరూ తమ ఫోన్లను, గ్యాడ్జెట్లను పక్కన పెట్టాల్సిందిగా కోరారు.ఆ ఆలోచనకు అందరూ అంగీకారం తెలిపారు.దాంతో ఈ గ్రామంలో రోజు ఏడు గంటలకు సైరన్ మోగగానే గ్రామస్థులంతా ఫోన్లను పక్కన పడేస్తారు.ల్యాప్‌టాప్స్‌, టీవీలను ఆఫ్ చేస్తారు.

ఏడింటికి మొదలుకొని 8:30 వరకు అన్ని ఎలక్ట్రానిక్ డివైజ్‌లకు దూరమవుతారు.ఈ సమయంలో కుటుంబ సభ్యులందరూ ఒకరికొకరు సమావేశమై చక్కగా మాట్లాడుకుంటారు.

కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు సంబంధించిన హోం వర్క్ చేయిస్తారు.మిగతా వారు ఊరి బాగోగుల కోసం ఏం చేయాలో చర్చిస్తారు.

Telugu Pm, Detox, Maharashtra, Sangli, Tech, Innovative Idea-Latest News - Telug

ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుందో చెప్పలేదు కదూ.ఆ గ్రామం మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలోని ఉంది.మోహిత్యాంచే వడ్గావ్ అని ఈ గ్రామాన్ని పిలుస్తారు.ఈ గ్రామ ప్రజలు ఏడు కాగానే అన్ని ఎలక్ట్రానిక్ డివైజ్‌లను పక్కన పెట్టేసి ప్రొడక్ట్ వర్క్ చేస్తారు.గ్రామ పెద్దలు అందరూ ఒకచోట చేరి విలేజ్ డెవలప్మెంట్ ఎలా చేయాలో డిస్కషన్ చేస్తారు.విద్యార్థులు బుద్ధిగా చదువుకుంటారు.

తొందరగా హాయిగా ఆడుకొని శారీరకంగా దృఢపడతారు.టెక్నాలజీ లేని ప్రపంచం ఎంతో హాయిగా ఆనందంగా ఉంటుందని ఈ గ్రామ ప్రజలు చెబుతున్నారు.

ఈ గ్రామస్తులను చూసి పక్క గ్రామస్థులు కూడా ఇదే విధానాన్ని పాటించడం స్టార్ట్ చేస్తున్నాయి.ఏదైమైనా ఈ ఆలోచనకి ‘టేక్ ఏ బో!’ అని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube