తెలంగాణ సీఎం కేసీఆర్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.కేసీఆర్ ఊహాలోకాల్లో విహరిస్తున్నారన్న ఆయన.
వెళ్లిన ప్రతీ చోటా కేసీఆర్ అవమానాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు.కేసీఆర్ తీరు ఇంట్లో ఈగల మోత.బయట పల్లకీ మోత అన్న చందాన ఉందని ఎద్దేవా చేశారు.ఎవరూ కూడా కేసీఆర్ ఊకదంపుడు ఉపన్యాసాలను అంగీకరించడం లేదని విమర్శించారు.
రాష్ట్రానికి కేంద్రం ఏం చేయడం లేదని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు కేసీఆర్ గ్రామ పంచాయతీలకు ఎన్ని నిధులు ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
గ్రామాల అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులను కూడా సకాలంలో ఇవ్వకపోగా.సర్పంచ్ లను కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు.