హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ పై కేసు నమోదు అయింది.ఆయనతో పాటు హెచ్సీఏపై మూడు కేసులు నమోదు చేసినట్టు బేగంపేట పోలీసులు తెలిపారు.
సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ లో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన బాధితురాలితో పాటు ఎస్ఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ యాక్ట్ తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు.అంతేకాకుండా మ్యాచ్ టికెట్లను బ్లాక్ లో అమ్ముకున్నారన్న ఆరోపణలపైనా కూడా ఫిర్యాదులు వచ్చినట్టు తెలిపారు.







