గ్లామర్ డోస్ పెంచిన ప్రణీత.. అయిన సంప్రదాయాన్ని మరవని హీరోయిన్..?

సామాన్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్స్ చాలావరకు సాంప్రదాయ పద్ధతుల వంటి వాటిని పట్టించుకోరు.ముఖ్యంగా పెళ్లిళ్లు చేసుకునే హీరోయిన్లు మాత్రం కనీసం మెడలో తాళిబొట్టును ఉంచుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు.

 Praneetha Who Has Increased The Dose Of Glamour Is A Heroine Who Has Not Forgott-TeluguStop.com

కానీ కొందరు హీరోయిన్లు మాత్రం అలా కాదు.సినిమా షూట్ లో ఉన్నంత సమయంలో సినిమా తగ్గట్టుగా కనిపించిన కూడా ఆ తర్వాత తమ సంప్రదాయాలను, ఆచారాలను పాటిస్తూ ఉంటారు.

అందులో కన్నడ ముద్దుగుమ్మ ప్రణీత ఒకరిని చెప్పవచ్చు.ఏం పిల్లో.

ఏం పిల్లడో అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ అతి తక్కువ సమయంలో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.ఆ తర్వాత పలు సినిమాలలో నటించింది.

అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో నటించి తన పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అలా బ్రహ్మోత్సవం, రభస వంటి పలు సినిమాలలో నటించింది.

కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతగా మెప్పించలేకపోయింది.టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటించింది.

ఇక కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటించి తనేంటో నిరూపించుకుంది.కానీ ఏ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలువలేకపోయింది ఈ ముద్దుగుమ్మ.

ఇక ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా కంటే వ్యక్తిగతంగా మంచి పేరు సంపాదించుకుంది.ప్రణీత ఫౌండేషన్ పేరు మీద ఇప్పటికీ ప్రతిరోజు సహాయం చేస్తూనే ఉంటుంది.

గతంలో కరోనా సమయంలో కూడా ఎంతో సహాయంతో ముందుకు వచ్చింది.ఇక ఈమె బాలీవుడ్ లో మంచి సక్సెస్ లో ఉన్న సమయంలో బెంగళూరుకు చెందిన నితిన్ రాజ్ అనే ఓ బడా బిజినెస్ మాన్ ను వివాహం చేసుకుంది.

ఇక పెళ్లి జీవితంలోకి అడుగు పెట్టాక సినిమాలకు పూర్తిగా బ్రేక్ ఇచ్చింది.

పైగా ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.ఇక ప్రణీత సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది.పాప పుట్టిన తర్వాత కూడా తన ఫిజిక్ లో ఎటువంటి మార్పులు లేవని చెప్పవచ్చు.

ఇంకా తన అందాన్ని రెట్టింపు చేసుకుంటూ సోషల్ మీడియాలో వాటిని బాగా పంచుకుంటూ ఉంటుంది.అప్పుడప్పుడూ తన వ్యక్తిగత విషయాలను, తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను పంచుకుంటుంది.

ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.ఇక ప్రణీత ఎంత హీరోయిన్ అయినా కూడా తను మాత్రం తమ పద్ధతులను బాగా పాటిస్తుంది.

చాలా వరకు అవి సోషల్ మీడియా ద్వారా బయటపడుతూ ఉంటాయి.

ఏదైనా పండుగ సందర్భం వస్తే చాలు.ట్రెడిషనల్ లో తయారయ్యి ధరించాల్సిన మంగళసూత్ర, మెట్టలు ధరించి, బొట్టు పెట్టుకొని మరి కనిపిస్తుంది.పైగా తన భర్తకు చేయాల్సిన పూజలు కూడా చేస్తుంది.

ఇక తన పాపకు కూడా కాటుక పెడుతూ, దిష్టి తగలకుండా పూసలు కూడా కడుతూ ఉంటుంది.ఇక ఈ బ్యూటీ గ్లామర్ షో కూడా బాగానే చేస్తుంది.

ఈ మధ్య తెగ ఫోటో షూట్ లు చేయించుకోగా అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.ఇక తాజాగా తన గ్లామర్ ఫోటోలు పంచుకుంది.

అందులో తను హాట్ హాట్ గా కనిపించినా కూడా.మెట్టలు పెట్టుకొని మరి తన సాంప్రదాయాన్ని కాపాడింది.

ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ అవ్వడంతో.ఆ ఫోటోని చూసిన నెటిజన్స్ ప్రణీతను బాగా మెచ్చుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube