దేశంలోకి విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి.ముఖ్యంగా ఎయిర్‌పోర్టుల్లో, పోర్టుల ద్వారా దేశంలోకి భారీ ఎత్తున డ్రగ్స్ కొంత మంది తీసుకొస్తున్నారు.
ఇక వీడొక్కడే సినిమా తరహాలో పోలీసులకు దొరక్కుండా వింత వింత పద్ధతుల్లో డ్రగ్స్ రవాణా సాగుతోంది.కొంత మంది అండర్‌వేర్స్‌లో, ఇంకొంత మంది శరీర భాగాల్లో డ్రగ్స్ దాస్తున్నారు.
కొంత మంది క్యాప్సూల్స్ రూపంలో మింగేసి, వాటిని ఎనిమా ద్వారా బయటకు వచ్చిన తర్వాత తీస్తున్నారు.ఇలా కొందరు చేస్తున్నా, ఎప్పటికప్పుడు కొత్త పంథాలు అనుసరిస్తున్నారు.
తాజాగా ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు వెడ్డింగ్ కార్డ్‌ని తెరిచి డ్రగ్స్‌లో దాచి ఉంచారని చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఖరీదైన వెడ్డింగ్ కార్డ్ చూడగానే చాలా మందికి ఏదో శుభకార్యం జరుగుతుందనే భావన కలుగుతుంది.
అయితే ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు మాత్రం చాలా తెలివిగా అందులో దాగున్న డ్రగ్స్‌ను కనుగొన్నారు.వాస్తవానికి రెండేళ్ల క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది.
అధికారులు వెడ్డింగ్ కార్డ్ కవర్‌ను తీసివేసి, డ్రగ్స్‌ను చాలా తెలివిగా దాచి ఉంచినట్లుగా కనిపెట్టారు.దానిని చింపివేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.
ఈ వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ ట్విట్టర్‌లో తాజాగా షేర్ చేశారు.ఒక అమ్మాయి పెళ్లి కార్డులు తీసుకువెళుతుందని, అయితే తనిఖీలో అందులో డ్రగ్స్ ఉన్నట్లు తేలిందని ఆయన పోస్ట్‌లో వివరించారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఈ వీడియో 1.5 లక్షలకు పైగా వ్యూస్, 5,000 కంటే ఎక్కువ లైక్‌లను సంపాదించింది.అమ్మాయి లోపల డ్రగ్స్ ఎలా తీసుకోగలిగిందో తెలుసుకోవాలని వినియోగదారులు కామెంట్లు పెట్టారు.ఫిబ్రవరి 2020లో బెంగళూరులో కస్టమ్స్ అధికారులు 43 వివాహ ఆహ్వానపత్రికల్లో దాచిన రూ.5.05 కోట్ల విలువైన ఐదు కిలోల ఎఫెడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.డిపార్ట్‌మెంట్ ప్రకారం, ఎగుమతి సరుకును మధురైకి చెందిన వ్యక్తి వాటిని బుక్ చేశాడు.
ఆస్ట్రేలియాకు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తెలిసింది.ఎఫెడ్రిన్ అనేది నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్, 1985 ప్రకారం నిషేధిత పదార్థాల జాబితాలో చేర్చబడింది.
దానిని ఎవరి రవాణా చేసినా, విక్రయించినా, వాడినా నేరం కింద పరిగణించబడుతుంది.







